Pakistan: పాకిస్తాన్‌లోని ఈ నగరంలో 80 శాతానికి పైగా హిందువులు.. గోవధపై నిషేధం, ప్రతీ వీధిలో ఆలయం..
- పాకిస్తాన్‌లోని మిఠిలో 80 శాతానికి పైగా హిందువులు..
- మిఠి నగరంలో హిందువులదే ఆధిపత్యం..
- గోవధపై పూర్తిగా నిషేధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ మతం ఆధారంగా భారత్ నుంచి విడిపోయి ఇస్లామిక్ రిపబ్లిక్‌గా మారింది. ఆ దేశంలో 96 శాతం మంది ముస్లింలే, కేవలం 1-2శాతం మంది హిందువులు ఉన్నారు. పాకిస్తాన్ విభజన సమయంలో 20 శాతం వరకు ఉన్న హిందువులు, అణిచివేత కారణంగా కేవలం సింగిల్ డిజిట్‌కి పరిమితమయ్యారు. హిందువులపై అఘాయిత్యాలు, కిడ్నాప్‌లు పాకిస్తాన్ వ్యాప్తంగా జరుగుతూనే ఉంటాయి. బాలికలు, మహిళల్ని బలవంతంగా అపహరించి, మతం మార్చి, పెళ్లి చేసుకుంటున్న ఘటనలు చాలానే ఉన్నాయి. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ యొక్క 2023 జనాభా లెక్కల ప్రకారం, 2023 సంవత్సరంలో పాకిస్తాన్ మొత్తం జనాభా దాదాపు 24 కోట్ల 04 లక్షల 58 వేల 089. ఈ మొత్తం జనాభాలో ముస్లింల వాటా దాదాపు 96.35 శాతం. అయితే 2023 జనాభా లెక్కల ప్రకారం, పాకిస్తాన్ మొత్తంలో హిందువుల జనాభా కేవలం 1.61 శాతం మాత్రమే.
80 శాతం హిందూ జనాభా..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
అయితే, ఇలాంటి పాకిస్తాన్లో ఒక్క నగరంలో మాత్రం హిందువుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఈ నగరంలోనే 80 శాతం హిందూ జనాభా ఉంది. ఆ నగరం పేరు ‘‘మిఠీ’’. పాకిస్తాన్లో పంజాబ్ ప్రావిన్సులోని థార్పార్కర్ జిల్లాలో ఉంది. ఇది జిల్లా హెడ్‌క్వార్టర్. పూర్తిగా ఎడారి ప్రాంతంలోని మట్టిదిబ్బల మధ్య నగరం నెలకొని ఉంది. కరాచీ నుంచి దాదాపుగా 5-6 గంటల దూరంలో ఈ మిథి నగరం ఉంది. భారత్ సరిహద్దుకు దగ్గరగా ఉంటుంది.
మిఠిలో హిందువుల ఆధిపత్యం..
పాకిస్తాన్ లోని అన్ని ప్రాంతాల్లో ముస్లింల ఆధిపత్యం ఉంటే, మిఠిలో మాత్రం హిందువుల రాజ్యమే నడుస్తుంది. దీనిని మిని హిందూస్తాన్‌గా వ్యవహరిస్తుంటారు. ఈ నగరంలో ప్రతీ వీధిలో ఆలయం ఉంటుంది. ప్రతీ ఇంటిపై ఓం, స్వస్తిక్ చిహ్నాలతో పాటు జైశ్రీరాం వంటి నినాదాలు కనిపిస్తుంటాయి. దీపావళి, హోళీ లాంటి పండగలు ఘనంగా జరుపుకుంటారు. జగదీష్ కాలనీ అంటూ ప్రతీ వీధి కూడా హిందూ మతాన్ని సూచిస్తుంది. ఈ మిథిలోని చాలా వరకు వ్యాపారం, దుకాణాలు హిందువుల చేతుల్లోనే ఉంటాయి.
గోవధపై నిషేధం:
పాక్‌లోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ ఒక్క ప్రాంతంలోనే పశువధపై నిషేధం ఉంది. ప్రతీ హిందూ కుటుంబం కూడా ఆవుల్ని పెంచుకుంటుంది. వీధుల్లో ఆవులు, పశువులు స్వేచ్ఛగా తిరుగుతుండటం చూడొచ్చు. ఇక్కడ నివసించే ముస్లింలు కూడా గోమాంసం తినరు. ఇరువర్గాలు కూడా కలిసి మెలిసి ఉంటాయి. ఒకరి పండగల్లో ఒకరు భాగమవుతారు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!