Ajit Pawar: దేశంలో మెజారిటీ ప్రజలు మరోసారి నరేంద్రమోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అజిత్ పవార్ పలు సందర్భాల్లో ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర అదికార కూటమిలో ప్రతీ ఒక్కరూ మోడీని గెలిపించడానికి పనిచేస్తున్నామని అజిత్ పవార్ ఆదివారం అన్నారు. బారామతిలో రైతుల ర్యాలీని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు.
Read Also: Government data: ఆహారంపై తక్కువ ఖర్చు చేస్తున్న భారతీయులు.. గృహ వినియోగ వ్యయ సర్వేలో కీలక విషయాలు..
65 శాతం మందికి పైగా ప్రజలు నరేంద్రమోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు గెలవడానికి కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉందని, అందరూ విబేధాలు మరిచి పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
ఎన్సీపీలో చీలిక తర్వాత అజిత్ పవార్ వర్గం మహారాష్ట్రలోని శివసేన-బీజేపీ కూటమిలో చేరింది. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవి దక్కింది. ఎన్సీపీలోని మరో వర్గం శరద్ పవార్ ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నారు. ఇటీవల మహారాష్ట్ర స్పీకర్‌తో సహా, కేంద్ర ఎన్నికల సంఘం నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్‌దే అని తీర్పు చెప్పారు.
