Monsoon In India: ఒకేసారి ఢిల్లీ, ముంబయిలను తాకిన నైరుతి రుతుపవనాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monsoon In India: దేశంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. రుతుపవనాల రాకతో కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. కొన్ని రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. నైరుతి రుతుపవనాలు దేశమంతటా క్రమంగా విస్తరిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబయిలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈ రెండు నగరాలను రుతుపవనాలు ఏకకాలంలో తాకడం అరుదుగా జరుగుతుంది. షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందు ఢిల్లీని.. రెండు వారాల ఆలస్యంగా ముంబయిను నైరుతి రుతుపవనాలు తాక్కినట్టు భారత వాతావరణ విభాగం (IMD) ఆదివారం వెల్లడించింది. ఆరు దశాబ్దాల క్రితంత ఇలా జరిగిందని గుర్తు చేసిన అధికారులు.. చివరి సారిగా 1961 జూన్ 21న ఢిల్లీ, ముంబయి నగరాల్లోకి ఒకే రోజున రుతుపవనాలుప్రవేశించినట్టు ఐఎండీ ప్రకటించింది.
Read also:Group War in TDP: టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు.. బస్సు యాత్ర వాయిదా
Also Read
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- Smit Machchhar & Sandra Samuel: అప్పట్లో సాండ్రా శామ్యూల్, ఇప్పుడు స్మిత్ మచ్ఛార్..
- UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
- CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
‘నైరుతి రుతుపవనాలు ముంబయి సహా మహారాష్ట్ర మొత్తం విస్తరించాయి. మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీతో పాటు హరియాణా, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూలోని కొన్ని ప్రాంతాల్లోనూ విస్తరించాయి. వచ్చే రెండు రోజుల్లో మరింత ముందుకు కదలి మిగతా ప్రాంతాలకు చేరుకుంటాయని ఐఎండీ డైరెక్టర్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర అన్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలలో ఎండ వేడిమి నుంచి వర్షం ఉపశమనం కలిగించినప్పటికీ.. గురుగ్రామ్‌లోని వివిధ ప్రాంతాలలో వర్షం నీరు నిలిచిపోయింది. గత 24 గంటల్లో ముంబయి దాని చుట్టపక్కల ఏకధాటిగా కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సోమవారం ఉదయం వరకూ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి అంధేరీ, మలద్, దాషిర్‌లు ముంపు బారినపడ్డాయి. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్, రత్నగిరి జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పాల్ఘర్, ముంబయి, థానే, సింధుదుర్గ్‌లకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
Read also:Uppal Skywalk: ఉప్పల్ స్కైవాక్.. నేడు ప్రారంభించనున్న కేటీఆర్
ముంబయి, మధ్య మహారాష్ట్ర సహా మహారాష్ట్ర తీరప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. బంగాళాఖాతం మరియు గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలోని సినోప్టిక్ పరిస్థితుల కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ముంబై, మధ్య మహారాష్ట్రల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో వాయుగుండం మరియు మహారాష్ట్ర మీదుగా కోస్తా కర్ణాటక వరకు వ్యాపించిన చురుకైన ద్రోణి వంటి సినోప్టిక్ పరిస్థితులు కొంకణ్‌తో సహా వచ్చే 48 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!