Monsoon: మరి కొద్దిసేపట్లో కేరళకు రుతుపవనాలు.. 16 ఏళ్లలో..!
- మరికొన్ని గంటల్లో కేరళకు రుతుపవనాలు
- దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది వేసవి కాలంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మర్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతాయి. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. కానీ ఈ ఏడాది భిన్నమైన వాతావరణం నెలకొంది. పెద్దగా ఎండల ప్రభావం కనిపించకుండానే వేసవి ముగుస్తోంది. గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చల్లని వాతావరణం నెలకొనడంతో ప్రజలు అంతగా ఇబ్బంది పడిన పరిస్థితులు కనిపించలేదు. ఇక రోహిణి కార్తె మే 25న(ఆదివారం) రానుంది. ఇది జూన్ 8 వరకు ఉంటుంది. రాహిణి కార్తె సమయంలో ఎండలు భగభగ మండిపోతాయి. తీవ్ర ఉష్ణోగ్రతతో బండరాళ్లు కూడా పగిలిపోతాయంటారు. అలాంటిది ఈ ఏడాది ఆ పరిస్థితులు కనిపించలేదు. ప్రతి రోజు మేఘాలు కమ్ముకోవడంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి.
ఇది కూడా చదవండి: TG POLYCET Result 2025: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల.. బాలికలదే హవా
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇక మరికొద్ది సేపట్లోనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 16 సంవత్సరాల తర్వాత తొలిసారిగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయని.. షెడ్యూల్ కంటే 8 రోజులు ముందే వచ్చేస్తున్నాయని ఐఎండీ తెలిపింది. 2009, 2001లో కూడా ఇలానే రుతు పవనాలు త్వరగా వచ్చాయి. మే 23నే రుతుపవనాలు వచ్చేశాయి. మళ్లీ ఇన్నాళ్లకు త్వరగా రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. ఇక వాతావరణ శాఖ ప్రకటనతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ రెండో రోజుల కస్టడీ పూర్తి.. మరోసారి అస్వస్థత..
సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. కానీ ముందుగానే రుతుపవనాలు రావడంతో సంతోషకరమని ఐఎండీ తెలిపింది. దీంతో కేరళ, దక్షిణాది రాష్ట్రాల్లో రాబోయే 6 రోజులు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక గోవా, గుజరాత్, ఢిల్లీ-ఎన్సీఆర్లలో కూడా భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.
తొలిసారిగా 1918 మే 11న వర్షాలు కురిసిన రికార్డు ఉంది. మరోవైపు ఆలస్యంగా ప్రారంభమైన రికార్డు 1972లో నమోదైంది. ఆ సమయంలో రుతుపవనాలు జూన్ 18న ప్రారంభమయ్యాయి. గత 25 సంవత్సరాల్లో అత్యంత ఆలస్యంగా రుతుపవనాలు వచ్చింది 2016లోనే. జూన్ 9న రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఇక రుతుపవనాలు రాకతో మే 29 వరకు కేరళ, తీరప్రాంత కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. తమిళనాడు, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో కూడా రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ వర్షాలు మరియు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!