NTV Telugu Site icon

Monkeypox: ఇండియాలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు..? ఎక్కడంటే..

Monkeypox

Monkeypox

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కలవరపెడుతోంది మంకీపాక్స్ వ్యాధి. ఇప్పటికే 58 దేశాల్లో 6000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా యూకే, స్పెయిన్, జర్మనీ, ప్రాన్స్ వంటి యూరోపియన్ దేశాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 85 శాతం కేసులు ఒక్క యూరోప్ ఖండంలోనే నమోదు అయ్యాయి.

తాజాగా ఇండియాలో మంకీపాక్స్ కేసుల నమోదు అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోల్ కతాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరిన విద్యార్థికి మంకీపాక్స్ సోకినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. అనుమానిత వ్యక్తి గత కొద్ది రోజుల క్రితం యూరప్ నుంచి తిరిగి వచ్చాడు. వెస్ట్ మిడ్నాపూర్ కు చెందిన యువకుడి శరీరంపై దద్దర్లు ఏర్పడ్డాయి. మంకీపాక్స్ లక్షణాలతో కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. మంకీపాక్స్ గా అనుమానించడంతో అతని శాంపిళ్లను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవీ)కి పంపారు. దీనికి సంబంధించిన ఫలితాలు ఇంకా రాలేదు. ప్రస్తుతం అనుమానితుడికి సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులను వెస్ట్ బెంగాల్ వైద్యారోగ్య శాఖ అప్రమత్తం చేసింది. అనుమానిత వ్యక్తిని ఐసోలేషన్ లో ఉంచారు.

Read Also:Amarnath Yatra: అమర్ నాథ్ లో కుంభవృష్టి..వరదల్లో చిక్కుకున్న 12 వేల మంది యాత్రికులు

బాధిత వ్యక్తి యూరప్ లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఈక్రమంలోనే ఇటీవల సొంత దేశానికి తిరిగి వచ్చాడు. మంకీపాక్స్ అనుమానతంతో ఓ వ్యక్తి శాంపిళ్లను పరీక్షలకు పంపడం ఇదే తొలిసారని.. దద్దుర్ల నుంచి తీసిన ద్రవాన్ని పరీక్షల నిమిత్తం పంపించామని వైద్యులు వెల్లడించారు.