NTV Telugu Site icon

Momos Eating: మోమోస్‌ పందెం.. యువకుడి మృతి

Momos Eating

Momos Eating

Momos Eating: సరదా కోసం వేసే పందాలు ఒక్కోసారి సీరియస్‌గా మారుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలుగా మారుతుంటాయి. అలాంటిదే మోమోస్‌ తినే పందం. మోమోస్‌ తినే పందెంలో 150 మోమోస్‌ తింటానని పందెం కాసిన యువకుడు.. పందెం అనంతరం అస్వస్థకు గురై మరణించాడు. ఈ బీహార్‌లో జరిగింది. . బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన బిపిన్ కుమార్ పాశ్వాన్(25) మొబైల్ రిపేర్ షాపు నిర్వహిస్తున్నాడు. రెండు రోజుల క్రితం పాశ్వాన్ త‌న స్నేహితుల‌ను క‌లిశాడు. అంద‌రూ క‌లిసి ముచ్చటిస్తుండ‌గా, మోమోలు ఎవ‌రు ఎక్కుత తింటారో చూద్దామ‌ని ఫ్రెండ్స్ పందెం కాశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గోపాల్‌గంజ్‌లో కొందరు స్నేహితులు ఎంజాయ్‌ చేస్తూ, వారిలోవారు మోమోస్‌ ఈటింగ్‌ ఛాలెంజ్‌ పెట్టుకున్నారు. దీనిలో పాల్గొన్న బిపిన్‌ కుమార్‌ ఛాలెంజ్‌కు మించి అధికంగా మూమూస్‌ తిన్నాడు. దీంతో ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. బిపిన్‌ పరిస్థితిని గమనించిన అతని స్నేహితులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాధితుడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పాశ్వాన్ డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి త‌ర‌లించారు.

Read also: Trains Cancelled: తెలుగు రాష్ట్రాల మధ్య పలు రైళ్లను రద్దు చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే

బిపిన్‌ మృతి నేపధ్యంలో అతని తండ్రి మాట్లాడుతూ తన కుమారుని చేత విషం తినిపించారని, తన కుమారుడిని అతని స్నేహితులే హత్య చేశారని ఆరోపించారు. వారంతా ఉద్దేశపూర్వకంగానే ఈ ఛాలెంజ్‌ చేసి, తన కుమారుడని హత్యచేశారని ఆరోపించారు. త‌న కుమారుడిపై అత‌ని స్నేహితులు విష ప్రయోగం జ‌రిపార‌ని పాశ్వాన్ తండ్రి ఆరోపించారు. పాశ్వాన్‌ను కావాల‌నే చంపార‌ని పేర్కొన్నాడు. కావాల‌నే మోమోస్‌లో విషం నింపి, పందెం కాశార‌ని, అవి తిన‌డంతో చ‌నిపోయాడ‌ని అతని తండ్రి పేర్కొన్నాడు. త‌మ కుమారుడి మృతి కేసులో విచార‌ణ జ‌రిపి, కార‌కుల‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్ చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.