Mollywood: లైంగిక ఆరోపణలు మలయాళ ఫిలిం ఇండస్ట్రీని కలవరపెడుతున్నాయి. ఇటీవల మాలీవుడ్‌లో మహిళా నటులపై ప్రభుత్వం నియమించిన హేమా కమిటి సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. మహిళలు ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటి వేధింపులను ఎదుర్కొంటున్నారనే విషయాలను వెల్లడించింది. ఈ కమిటీ రిపోర్టు తర్వాత బాధితులు ఒక్కొక్కరిగా తమకు జరిగిన అనుభవాలను, వేధింపులను చెబుతున్నారు.
ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మొత్తం 17 కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాలు మలయాల మూవీ ఆర్టిస్ట్ అసోసియేటన్ ‘‘అమ్మ’’ రద్దుకు దారి తీశాయి. ఈ వేధింపుల ఆరోపణల్లో పలువురు నటులని, నిర్మాతని ప్రశ్నించే అవకాశం ఉంది. 2013లో ఓ సినిమా సెట్‌లో ఒక నటుడు తనను వేధించాడని నటి సోనియా మల్హార్ తాజాగా ఫిర్యాదు చేశారు. కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)కి ఆమె ఫిర్యాదు చేశారు.
Read Also: Siddique : నటుడిపై నటి రేప్ కేసు.. తెలుగులోనూ?
మిను మునీర్ అనే నటి తనను ఎం ముఖేష్, జయసూర్య, మణియంపిల్ల రాజు, ఇడవెల బాబు వేధించారని గతంలో ఆరోపించారు. ఫిర్యాదు చేసిన తర్వాత నుంచి తనకు బెదిరింపులు వస్తున్నట్లు చెప్పారు. నిన్న సాయంత్రం ఆమె తనకు వచ్చిన బెదిరింపు మెసేజులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై సిట్ ఆమె స్టేట్‌మెంట్‌ని రికార్డ్ చేయనుంది. ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను టాయ్‌లెట్ నుంచి బయటకు రాగానే హీరో జయసూర్య తన సమ్మతి లేకుండా వెనకనుంచి కౌగిలించుకుని ముద్దులు పెట్టాడని ఆరోపించింది. తనకు నచ్చినట్లు చేస్తే మరిన్ని ఛాన్సులు ఇస్తానని చెప్పాడని ఆమె చెప్పింది. అమ్మ సభ్యత్వం పొందేందుకు సాయం చేస్తానని చెస్తానని అమ్మ మాజీ సెక్రటరీ ఇడవెల బాబు తనను ఫ్లాట్‌కి పిలిచి శారీరంగా వేధించాడని ఆమె ఆరోపించారు. అధికార సీపీఎం ఎమ్మెల్యే, నలుడు ముఖేష్ కోరినట్లు చేయనందుకు తనకు సభ్యత్వాన్ని తిరస్కరించినట్లు చెప్పారు.
బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర కూడా ఇలాంటి ఆరోపనలే చేశారు. దర్శకుడు రంజిత్ తనపై వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఏ చిత్ర పరిశ్రమలో అయినా మహిళకు వేధింపులు బహిరంగ రహస్యమని చెప్పారు. ఒక్కొక్కరుగా వేధింపుల గురించి ఆరోపనలు చేస్తున్న క్రమంలో మలయాళ చిత్ర పరిశ్రమ యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థ AMMA నైతిక బాధ్యత వహించి, ప్రముఖ నటుడు మోహన్ లాల్ ప్యానెల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.