Rape case filed against Malayalam actor Siddiqui: ఒక నటి లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి మలయాళ నటుడు సిద్ధిక్‌పై కేరళ పోలీసులు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) దాఖలు చేశారు. సిద్ధిక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ నటి రేవతి సంపత్ మంగళవారం లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. నటి ఫిర్యాదు మేరకు త్రివేండ్రం మ్యూజియం పోలీసులు నాన్ బెయిలబుల్ నేరం కింద అత్యాచారం కేసు నమోదు చేశారు. నిన్న సాయంత్రం, మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) నటి ఫిర్యాదు చేసింది. ఎనిమిదేళ్ల క్రితం 2016లో జరిగిన ఘటనపై సిద్ధిక్‌పై కేసు నమోదు చేసేందుకు నటి అంతకుముందు ప్రయత్నం చేయలేదు.
Nandyala: అమానుషం.. మానసిక వికలాంగురాలైన మైనర్పై అత్యాచారం
హేమ కమిటీ నివేదికలోని అంశాలను సీనియర్ మలయాళ నటుడు తోసిపుచ్చిన కొద్ది రోజుల తర్వాత ఆమె శనివారం మీడియా ముందుకు వచ్చింది. సినిమా చర్చల ముసుగులో, సిద్ధిక్ మస్కట్ హోటల్‌లోని తన గదికి పిలిచాడని, అక్కడ అతను తనను లైంగికంగా వేధించాడని ఆమె ఆరోపించింది. “ఆ హోటల్‌లో అతను నన్ను లైంగికంగా వేధించాడు, అది ఒక ఉచ్చు. అతను ఇప్పుడు చెప్పేది పూర్తిగా అబద్ధం” అని ఆమె కామెంట్ చేసింది. కాగా, ఈ ఆరోపణలు తన ప్రతిష్టను దిగజార్చే దుర్మార్గపు ప్రయత్నమని పేర్కొంటూ సిద్ధిక్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కి ఫిర్యాదు చేశారు. తాను నటిని 2016లో ఒక్కసారి మాత్రమే కలిశానని , అది కూడా ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే కలిశానని పేర్కొన్నాడు . లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) జనరల్ సెక్రటరీ పదవికి సిద్ధిక్ ఈ వారం ప్రారంభంలో రాజీనామా చేశారు. సిద్దిఖీ తెలుగులోనూ కొన్ని సినిమాలు చేశారు.