Mohan Bhagwat: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధిపతి మోహన్ భాగవత్ ఆదివారం బంగ్లాదేశ్ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాలోని హిందువులకు గట్టి సందేశం ఇచ్చారు. దేశంలో హిందూ జనాభా తమ హక్కుల కోసం పోరాడితే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మద్దతు లభిస్తుందని చెప్పారు. వర్లీలోని నెహ్రూ సెంటర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘‘100 ఇయర్స్ జర్నీ ఆఫ్ సంఘ్: న్యూ హారిజొన్’’ అనే కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రసంగించారు.
Read Also: Epstein files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో 169 సార్లు దలైలామా పేరు..
2024 ఆగస్టులో హింసాత్మక నిరసనల కారణంగా అప్పటి ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి అక్కడ హిందువులపై దాడులు మొదలయ్యాయి. ఇటీవల, విద్యార్థి నేత ఉస్మాన్ హాది మరణం తర్వాత హిందువుల్ని టార్గెట్ చేస్తూ పలు హత్యలు జరిగాయి.
భారతదేశ సమస్యలపై స్పందించిన మోహన్ భగవత్.. భారతదేశంలో మారుతున్న జనాభా స్వరూపాన్ని పరిష్కరించడానికి గత ప్రభుత్వాలు కృషి చేయలేదని అన్నారు. ఈ మార్పులకు జననాల రేటు, అక్రమ వలసలు ప్రధాన కారణమని అన్నారు. భారతదేశాన్ని ఇప్పుడు విడగొట్టలేదని , అలా ప్రయత్నించే వారే విచ్ఛినమవుతారని ఆయన అన్నారు. ఏ కులం వారైనా ఆర్ఎస్ఎస్ చీఫ్ కావచ్చని, ఎస్టీ-ఎస్టీ కావడం అనర్హత కాదని, బ్రహ్మణుడు కావడం అర్హత కాదని ఆయన అన్నారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభంలో బ్రహ్మణులతో ప్రారంభమైనప్పటికీ, అన్ని కులాల కోసం పనిచేస్తోందని చెప్పారు.
