Maulana Shahabuddin: మోడీ, యోగి ‘అఖండ భారత్’ కలని నేరవేర్చగలరు..

  • మోడీ-యోగి అఖండ భారత కలని నెరవేర్చగలరు..
  • ఏఐఎంజే చీఫ్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ మౌలానా షహబుద్దీన్ వ్యాఖ్యలు..
Maulana Shahabuddin

Maulana Shahabuddin

Maulana Shahabuddin: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని, ప్రధాని నరేంద్రమోడీ దేశంలో, సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన అందిస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందుతున్నారని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ (ఏఐఎంజే) జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ మౌలానా షహబుద్దీన్ బరేల్వీ అన్నారు. మోడీ, యోగిలు అఖండ భారత కలని సాకారం చేయగల గొప్ప వ్యక్తులని ప్రశంసలు కురిపించారు. దీని కోసం వారు చర్యలు తీసుకోవడం ప్రారంభించారని శనివారం అన్నారు.

Read Also: Ragi Dosa: రాగి దోశ తింటే కష్టపడకుండానే బరువు తగ్గడం ఖాయం!

ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ప్రకటన తర్వాత మౌలానా ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) పాకిస్తాన్ నుంచి విడిపోతుందని, త్వరలోనే భారత్‌లో భాగమవుతుందని సీఎం యోగి చెప్పారు. యోగి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. సింధ్ లేకుండా భారత్ సంపూర్ణం కాదని అన్నారు.

యోగి చెబుతున్నట్లు సింధ్ లేకుండా భారతదేశం సంపూర్ణం కాదని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత పీఓకే కాశ్మీర్‌లో భాగం అవుతుందని వ్యాఖ్యలు చేశారని మౌలానా షహబుద్దీన్ రజ్వీ అన్నారు. భారత్ ‘‘అఖండ భారత్‌’’లా ఉండాలి, పాకిస్తాన్ మాత్రమే కాదు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా భారత్‌లో భాగం కావాలి అని అన్నారు.