NTV Telugu Site icon

PM Mod: ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి ప్రసగించనున్న మోడీ

Pmmodi

Pmmodi

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి బీజేపీ అగ్ర నేతలంతా చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హెడ్‌క్వార్టర్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో ప్రధాని మోడీ కూడా బీజేపీ ఆఫీసుకు రానున్నారు. ఢిల్లీ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. కార్యాలయానికి పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు చేరుకున్నారు. ఇక ఢిల్లీలో ప్రధాన కార్యాలయం దగ్గర అమిత్ షాకు ఎంపీలు బాన్సురీ స్వరాజ్‌, మనోజ్‌ తివారీ, తదితరులు స్వాగతం పలికారు.

ఇది కూడా చదవండి: CM Chandrababu: ఢిల్లీ ఎన్నికల ఫలితాలో అదే జరిగింది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 48 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. దాదాపు 27 ఏళ్ల తర్వాత హస్తినలో కమలం పార్టీ సర్కార్‌ను ఏర్పాటు చేయనుంది. ఇక ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక ఓటమిని కేజ్రీవాల్ స్వాగతించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఘోర పరాజయం పాలయ్యారు.

ఇది కూడా చదవండి: GIG Workers Pension : కోటి మంది గిగా వర్కర్స్ కు గుడ్ న్యూస్.. ప్రభుత్వం పెద్ద బహుమతి