Site icon NTV Telugu

PM Modi-Keir Starmer: బీచ్ ఒడ్డున మోడీ-స్టార్మర్ ముచ్చట్లు.. ఎదురెదురుగా కూర్చుని కబుర్లు

Ukpm1

Ukpm1

ప్రధాని మోడీ-యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఆహ్లాదకరంగా గడిపారు. ముంబైలో చాలా ఉల్లాసంగా కనిపించారు. రెండు రోజుల పర్యటన కోసం యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఇండియాకు వచ్చారు. గురువారం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఆద్యంతం మోడీ-స్టార్మర్ ఉల్లాసంగా… ఉత్సాహంగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముంబైలోని అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న సుందరమైన రాజ్ భవన్ దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ-బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌ కలిసి తిరిగారు. పచ్చదనంపై కలిసి నడిచారు. ఒక చోట కొబ్బరిచెట్ల కింద కుర్చీల్లో ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకున్నారు. ఆయా పరిసరాలను కలిసి తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటూ.. నవ్వుకుంటూ ఆనందంగా.. ఉల్లాసంగా ముచ్చట్లు చెప్పుకుంటూ సాగిపోయారు.

చాలా సేపు నడుచుకుంటూ సముద్ర దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆనందంగా గడిపారు. పచ్చిక బయళ్లతో కూడిన ప్రశాంతమైన తీర ప్రాంతాన్ని చూస్తూ కనిపించారు. అంతేకాదు అంతకముందు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా స్టార్మర్ ఆస్వాదించారు.

‘‘నా స్నేహితుడు ప్రధాని కీర్ స్టార్మర్‌ను ముంబైలోని రాజ్ భవన్‌లో స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది. భారతదేశానికి తొలిసారి రావడం ఖచ్చితంగా ఒక ప్రత్యేక సందర్భం. భారతదేశానికి అతిపెద్ద వ్యాపార ప్రతినిధి బృందం హాజరు కావడం దీన్ని మరింత ప్రత్యేకంగా చేస్తుంది. భారతదేశం-యూకే సంబంధాల బలమైన సామర్థ్యాన్ని వివరిస్తుంది.’’ అని మోడీ రాసుకొచ్చారు.

 

Exit mobile version