Site icon NTV Telugu

Modi-Putin: హైదరాబాద్‌ హౌస్‌లో మోడీ-పుతిన్ ద్వైపాక్షిక భేటీ

Moid5

Moid5

రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన భారత్‌లో కొనసాగుతోంది. ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఘన స్వాగతం లభించింది. ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనాన్ని పుతిన్ స్వీకరించారు. అక్కడ నుంచి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.

ప్రస్తుతం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోడీ-పుతిన్ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశం తర్వాత పుతిన్-మోడీ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అటు తర్వాత రాష్ట్రపతి భవన్‌లో రాత్రి 7 గంటలకు పుతిన్‌కు ద్రౌపది ముర్ము ప్రత్యేక విందును ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంపై ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌తో శాంతియుత పరిష్కారానికి మోడీకి పుతిన్ హామీ ఇచ్చారు.

Exit mobile version