అమెరికా విదేశాంగ మంత్రి, ట్రంప్ అగ్ర సహాయకుడు మార్కో రూబియో భారత్‌లో పర్యటిస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన కోసం శనివారం ఉదయం కోల్‌కతా చేరుకున్నారు. గతేడాది విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇక కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీని సందర్శించారు.
ఇక పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కలిసేందుకు కోల్‌కతా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకుని మోడీతో సమావేశం అయ్యారు. రెండు దేశాల సంబంధాలపై ఇరువురు చర్చించే అవకాశం ఉంది. ప్రముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసేయడంతో వెనిజులా చమురు విక్రయించేందుకు అమెరికా సిద్ధపడుతోంది. ఈ నేపథ్యంలో వెనిజులా చమురుపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
ఇక ఆదివారం భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో సమావేశం కానున్నారు. అలాగే మంగళవారం ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కూడా మార్కో రూబియో పాల్గొననున్నారు. అంతేకాకుండా ఆగ్రా, జైపూర్‌లో కూడా పర్యటించే అవకాశం ఉంది.
‘‘భారత్‌తో కలిసి పనిచేయాల్సింది చాలా ఉంది. భారత్ గొప్ప మిత్రదేశం. భాగస్వామి. వారితో కలిసి ఎన్నో మంచి పనులు చేస్తున్నాం. అందుకే ఇది ముఖ్యమైన పర్యటన.’’ అంటూ భారత్ పర్యటనకు ముందు ఎక్స్‌లో మార్కో రూబియో అన్నారు.
Mother Teresa left a tremendous legacy of compassion and service. I was honored to visit the Missionaries of Charity today to pay homage to her legacy and to see the living example of the Catholic faith in action. pic.twitter.com/HCiATKgUDc
— Secretary Marco Rubio (@SecRubio) May 23, 2026
Joined @SecRubio in Kolkata for a visit to the Missionaries of Charity. Moments like these remind us the U.S.-India partnership rests not only on strong policies, but also on shared values and the spirit of selfless service that transcends borders. pic.twitter.com/dBBrEvmvnP
— Ambassador Sergio Gor (@USAmbIndia) May 23, 2026
#WATCH | West Bengal: US Secretary of State Marco Rubio and his wife Jeanette D. Rubio arrive at Kolkata Airport for their onward travel to Delhi. pic.twitter.com/t5rWTJfTWU
— ANI (@ANI) May 23, 2026
