Site icon NTV Telugu

Sanjay Raut: 2026 తర్వాత కేంద్రంలో మోడీ సర్కార్ కొనసాగుతుందో లేదో..?

Sanjay

Sanjay

Sanjay Raut: శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్‌ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026 తర్వాత కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కొనసాగుతుందో లేదో అనేది తనకు అనుమానంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీ తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేరు అనే సందేహం కలుగుతుందన్నారు. మోడీ ప్రభుత్వంలో అస్థిరత ఏర్పడితే మహారాష్ట్రలోనూ దాని ప్రభావం కన్పిస్తుందని పేర్కొన్నారు. ఇక, శివసేన(యూబీటి)కి చెందిన నేత రాజన్‌ సాల్వీ పార్టీని వీడతారనే ప్రచారం కొనసాగడంపై స్పందించిన ఆయన.. దర్యాప్తు సంస్థలు అరెస్టు చేస్తాయనే భయంతోనే అనేక మంది ఇతర పార్టీలోకి వెళ్తుంటారని చెప్పారు. అంతేకాకుండా.. దర్యాప్తు సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు భయపడని వ్యక్తులతో పార్టీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు సంజయ్ రౌత్ వెల్లడించారు.

Read Also: Bangladesh: పాఠ్యపుస్తకాల్లో బంగ్లా స్వాతంత్య్ర చరిత్ర సవరణలు.. యూనస్‌ సర్కార్ మాస్టర్ ప్లాన్!

మరోవైపు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేపై శివసేన(యూబీటీ) సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. షిండేకు తన సొంత పార్టీపైనే నియంత్రణ లేదని ఎద్దేవా చేశారు. పార్టీ పరంగా ఆయన ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా.. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడని విమర్శించారు. కానీ, బాలాసాహెబ్‌ సిద్ధాంతాలతో నడుస్తున్న మా శివసేన (యూబీటీ) విధానాలు ఇలాంటి వాటికి పూర్తి విరుద్ధం అన్నారు. మేం ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదని సంజయ్ రౌత్ చెప్పారు.

Exit mobile version