Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
- 4,399 రోజులు పూర్తి.. ఎన్నికైన ప్రధానిగా మోడీ కొత్త చరిత్ర
- 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
- పేదల సంక్షేమం నుంచి చంద్రయాన్ వరకు విజయాల ప్రస్తావన
- ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యంపై కేబినెట్ పూర్తి విశ్వాసం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narendra Modi : భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక అరుదైన చారిత్రాత్మక మైలురాయిని అధిగమించారు. దేశంలో అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా సేవలు అందించిన ‘ఎన్నికైన’ ప్రధానమంత్రిగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ, దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పేరిట ఉన్న సుదీర్ఘ కాల పరిమితి రికార్డును దాటేశారు. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రివర్గం (కేబినెట్) ప్రత్యేకంగా సమావేశమై ప్రధానికి ఘనంగా అభినందనలు తెలిపింది. దేశ ప్రజలు ఆయనపై ఉంచిన అపారమైన విశ్వాసానికి, ఆశీర్వాదాలకే ఈ ఘనత నిదర్శనమని కేబినెట్ కొనియాడింది. తనను తాను “ప్రధాన సేవక్”గా భావిస్తూ దేశ సేవకే అంకితమైన మోడీ నాయకత్వంలో భారతదేశం సరికొత్త పుంతలు తొక్కిందని కేంద్ర మంత్రులు ప్రశంసించారు.
గడిచిన 12 ఏళ్ల పాలనలో పేదల సంక్షేమాన్నే కేంద్రబిందువుగా చేసుకుని మోడీ ప్రభుత్వం ముందుకు సాగిందని కేంద్ర కేబినెట్ ఈ సందర్భంగా గుర్తుచేసింది. దేశంలోని కోట్లాది మంది పేదలకు పక్కా ఇళ్లు, విద్యుత్, గ్యాస్, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యాలను కల్పించడమే కాకుండా 80 కోట్ల మందికి ఉచిత రేషన్, 60 కోట్ల మందికి ఆరోగ్య భద్రతను కల్పించినట్లు పేర్కొంది. ఫలితంగానే దేశంలో 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడే అవకాశం లభించిందని తెలిపింది. వీటితో పాటు యువత, స్టార్టప్‌లు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వం అపూర్వమైన ప్రోత్సాహాన్ని అందించిందని, చంద్రయాన్ విజయంతో భారత శాస్త్ర సాంకేతిక సామర్థ్యం ప్రపంచ వేదికపై మెరిసిందని కేబినెట్ కొనియాడింది. మహిళా సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూనే, రైతుల సంక్షేమం కోసం పీఎం కిసాన్ నిధి, మద్దతు ధరల పెంపు, సాగునీటి ప్రాజెక్టులకు మోడీ ప్రభుత్వం ఎంతో ఊతాన్ని ఇచ్చిందని స్పష్టం చేసింది.
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
దేశ భద్రత, ఆర్థిక సంస్కరణల విషయంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు విప్లవాత్మకమైనవని కేంద్ర కేబినెట్ అభిప్రాయపడింది. ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ అమలు, వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) వంటి ఏళ్ల నాటి డిమాండ్లను తీర్చడంతో పాటు, జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ వంటి సాహసోపేతమైన చర్యలు తీసుకున్నారని కొనియాడింది. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశీయ తయారీ రంగానికి కొత్త ఊపు వచ్చిందని తెలిపింది. అంతర్జాతీయంగా భారతదేశానికి లభించిన జీ-20 అధ్యక్షత దేశ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా శిఖరాగ్రానికి చేర్చిందని, అంతర్జాతీయ యోగా దినోత్సవం, సోలార్ అలయన్స్ వంటి కార్యక్రమాలకు అంతటా గుర్తింపు లభించిందని పేర్కొంది. దేశంలో నెలకొన్న రాజకీయ స్థిరత్వం వల్లే ఈ వేగవంతమైన అభివృద్ధి సాధ్యమైందని, అటు ఆధునిక అభివృద్ధిని ఇటు దేశ వారసత్వాన్ని సమన్వయం చేస్తూ కొత్త భారతదేశ నిర్మాణం జరుగుతోందని కేబినెట్ అభినందించింది. మోడీ సమర్థవంతమైన నాయకత్వంలో 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం) లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ, ప్రధాని నరేంద్ర మోడీకి సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని కేంద్ర కేబినెట్ ఆకాంక్షించింది.
తాజావార్తలు
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
-
Post S*ex Tips: శృం*గారం తర్వాత ఈ జాగ్రత్తలు పాటించండి.. ఇన్ఫెక్షన్లు దరిచేరవంతే.!
-
Shiva Yoga: జూన్ 24న అత్యంత శక్తివంతమైన ‘శివ యోగం’.. ఈ 3 రాశుల వారికి తిరుగులేని అదృష్టం.!
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!