Site icon NTV Telugu

Delhi: రాష్ట్రపతితో మోడీ, అమిత్ షా వరుస భేటీలు.. ఆంతర్యమిదేనా?

Pmmodi

Pmmodi

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా వరుస భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఆదివారం గంట వ్యవధిలోనే ఇద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే దేశ వ్యాప్తంగా రాజకీయ ఊహాగానాలు తీవ్రం అవుతున్నాయి. ఏదో జరుగుతుందని చర్చ నడుస్తోంది. ఇటీవల మోడీ బ్రిటన్, మాల్దీవుల పర్యటన చేపట్టారు. ఆ పర్యటన తర్వాత రాష్ట్రపతిని కలిశారు.

ఇది కూడా చదవండి: Shibu Soren: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు పితృవియోగం.. శిబు సోరెన్ కన్నుమూత

ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనా సభ సజావుగా నడవడం లేదు. ఆపరేషన్ సిందూర్‌పై చేపట్టిన చర్చ మాత్రమే కొంచెం ప్రశాంతంగా నడిచింది. మిగతా సమయం అంతా బీహార్‌లో చేపట్టిన ఓటర్ సర్వేపైనే ఆందోళనలు కొనసాగుతున్నాయి. తక్షణమే సర్వేను నిలిపివేయాలని.. దానిపై చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Tamannaah : తమన్నా చెప్పిన లాలాజల చిట్కా‌పై హాట్ డిబేట్ – డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..?

వాస్తవానికి ఈ సమావేశాల్లో అనేక బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం కసరత్తు చేసింది. కానీ సభ మాత్రం నడవడం లేదు. క్రీడా సంస్థల పనితీరులో ఎక్కువ పారదర్శకతను కల్పించే జాతీయ క్రీడా పాలన బిల్లును ఆమోదించేందుకు జాబితా చేసింది. అలాగే ఆగస్టు 13 నుంచి మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ఆరు నెలల పాటు పొడిగించాలని హోంమంత్రి అమిత్ షా చేసిన తీర్మానం ఆమోదానికి జాబితా చేసింది. కానీ సభ సరిగ్గా నడవడం లేదు. అయితే ప్రతిపక్షాల నిరసనలను పట్టించుకోకుండా ఈ వారం ఉభయసభలు సజావుగా సాగించేందుకు అజెండాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతితో ఇరువురి భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఇక మోడీ భేటీపై అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడ లేదు.

బిల్లులు..

కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం పార్లమెంటులో జాతీయ క్రీడా పాలన బిల్లు-2025ను ప్రవేశపెట్టనున్నారు. ఇక మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగించాలనే తీర్మానాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

 

Exit mobile version