NTV Telugu Site icon

Mock Drill: దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్.. సంసిద్ధంగా గాంధీ హాస్పిట‌ల్‌

Mock Drill

Mock Drill

Mock Drill: కోవిడ్ సంక్షోభం తిరిగి పుంజుకున్న నేపథ్యంలో, ఈరోజు దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో మాక్ డ్రిల్‌లు నిర్వహిస్తున్నారు. కేసులు పెరిగితే తీసుకోవాల్సిన అన్ని చర్యలను ఆసుపత్రులు సిద్ధం చేస్తున్నాయి. ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ డ్రిల్‌ను పర్యవేక్షించారు.నగరంలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో మంత్రి మాండవ్యను పరిశీలించారు. ఇలాంటి డ్రిల్ నిర్వహించడం ద్వారా మనం ఎంత సన్నద్ధంగా ఉన్నామో తెలుస్తుందని, లోపాలుంటే సరిదిద్దుకోవచ్చని మంత్రి మాండవ్య అన్నారు. ఈనేపథ్యంలో.. ఈరోజు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. కోవిడ్‌ రోగుల సంఖ్య పెరిగితే ఎలాంటి చికిత్స అందించాలో ఆసుపత్రి సిబ్బంది సిద్ధం చేశారు. ఎంత వరకు సన్నద్ధమయ్యామో పరిశీలిస్తున్నామని గాంధీ ఆస్పత్రి అధికారి తెలిపారు. డ్రిల్‌లో భాగంగా క్లిష్టమైన ఆరోగ్య సదుపాయాలను సమీక్షిస్తారు. ఐసోలేషన్ బెడ్‌లు ఎన్ని ఉన్నాయి, ఆక్సిజన్ సపోర్ట్ బెడ్‌లు, ఐసీయూ బెడ్‌లు, వెంటిలేటర్ సపోర్ట్ బెడ్‌లు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది.

Read also: Woman SI Affair: డ్రైవర్‌తో మహిళా ఎస్సై రాసలీలలు.. కొడుకుతో కలిసి..

మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ జరుగుతోంది. ఆరోగ్య సదుపాయాలు, ఐసోలేషన్ పడకలు, ఆక్సిజన్, ఐసియు పడకలు, వెంటిలేటర్లు, వైద్యులు, నర్సులు, ఆయుష్ వైద్యులు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, అంబులెన్స్, పరీక్ష పరికరాలు, అవసరమైన మందులు మొదలైన వాటి లభ్యతను సమీక్షిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియా ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిని సందర్శించారు. మాక్ డ్రిల్ నిర్వహణను పర్యవేక్షించారు. కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాప్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మహమ్మారి కట్టడి చర్యలు తీసుకుంటున్నాయి. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కొవిడ్ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్ కొనసాగుతోంది. ఆరోగ్య సౌకర్యాలు, ఐసోలేషన్‌ బెడ్లు, ఆక్సిజన్‌, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు, డాక్టర్లు, నర్సులు, ఆయుష్‌ డాక్టర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల లభ్యత అలాగే అంబులెన్సు, పరీక్షా పరికరాలు, అవసరమైన మందులు తదితర అంశాలపై సమీక్షిస్తున్నారు. చైనా, జపాన్ సహా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. దీంతో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో దేశంలోని పలు విమానాశ్రయాల్లో నిర్ధారణ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొన్ని రాష్ట్రాలు మాస్క్‌లను తప్పనిసరి చేశాయి
Harish Rao: తెలంగాణలో భూముల రేట్లు పెరగడానికి కారణం అదే..