Site icon NTV Telugu

Manipur Violence: 23 రోజుల తర్వాత మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలు పునఃప్రారంభం

Manipur

Manipur

Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలతో తొమ్మిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు. ఇక, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి రావడంతో దాదాపు 23 రోజుల తర్వాత సోమవారం (డిసెంబర్ 09) మణిపూర్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పునఃప్రారంభించింది. ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, జిరిబామ్, చురాచంద్‌పూర్, కాంగ్‌పోక్పి, ఫర్జాల్ జిల్లాల్లో ప్రస్తుతం శాంతిభద్రతల పరిస్థితిని సమగ్రంగా సమీక్షించిన తర్వాత రాష్ట్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also: India- Bangladesh: భారత్తో సంబంధాలు బలంగానే ఉన్నాయి.. హసీనా వ్యాఖ్యలపై యూనస్ ఆందోళన

అయితే, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, విద్యా సంస్థలతో పాటు వివిధ కార్యాలయాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని మణిపూర్ ప్రభుత్వం నవంబర్ 19 (2024)న బ్రాడ్‌బ్యాండ్ సేవలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసింది . అయితే, Wi-Fi లేదా హాట్‌స్పాట్‌ల కనెక్షన్స్ కు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. కాగా, భవిష్యత్తులో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపి వేసే అవకాశం ఉన్నప్పటికి.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు ఇంటర్నెట్ వినియోగదారులందరూ దూరంగా ఉండాలని రాష్ట్ర హోం శాఖ తెలిపింది.

Read Also: Donald Trump: భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్..!

ఇక, జిరిబామ్‌లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లల మృతదేహాలను వెలికితీయడంతో పాటు ఇంఫాల్ లోయలో హింస చోటు చేసుకోవడంతో.. ఎమ్మెల్యేల ఇళ్ళు, ఇతర ఆస్తులపై అనేక మంది నిరసనకారులు దాడి చేయడంతో తొమ్మిది జిల్లాల్లో నవంబర్ 16న ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అయితే, మణిపూర్‌లో గత సంవత్సరం మే నుంచి మైటీలు, కుకీల మధ్య జాతి హింసలో 250 మందికి పైగా మరణించారు.. అలాగే, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Exit mobile version