NTV Telugu Site icon

MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ కోర్టుకు వర్చువల్గా హాజరుకానున్న ఎమ్మెల్సీ కవిత

Kavitha

Kavitha

MLC Kavitha: నేడు ఢిల్లీ కోర్టులో లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాబోతుంది. ఈ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ కొనసాగనుంది. ఈ విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఇతర నిందితులు హాజరు కానున్నారు. కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కల్వకుంట్ల కవిత హాజరు కాబోతున్నారు. గత విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ప్రతివాదులకు అందించిన కాపీలు క్లారిటీగా లేని పేపర్లను మళ్ళీ ఇవ్వాలని ట్రయల్ కోర్టు జడ్జి ఆదేశించారు.

Read Also: Chennai : చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానానికి తప్పిన పెను ప్రమాదం

ఇక, ఛార్జ్ షీట్ లోని కొన్ని కాఫీలను ట్రాన్స్ లేట్ చేసి అందించాలని ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది కోరారు. తెలుగు, ఇంగ్లీష్ పేపర్లు సరిగ్గా లేవని కోరిన కవిత తరపు న్యాయవాది.. ప్రతివాదులు అడిగిన కాపీలను సప్లై చెయ్యాలని సీబీఐకి స్పెషల్ కోర్ట్ జడ్జి ఆదేశించారు. దీంతో ఈ రోజు పూర్తి స్థాయిలో లిక్కర్ కుంభకోణంలో ఇరువురు వాదనలను రౌస్ అవెన్యూ కోర్టు వినబోతుంది.