Site icon NTV Telugu

Delhi Girl Murder: ఒక్క మిస్డ్ కాల్‌తో బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు..

Delhi Murder Case

Delhi Murder Case

Delhi Girl Murder: ఢిల్లీలో ఇటీవల 11 ఏళ్ల బాలిక ఆచూకీ కనిపించకుండా పోయింది. కొన్ని రోజుల తర్వాత హత్యకు గురై శవంగా దొరికింది. అయితే ఈ కేసును ఓ మిస్డ్ కాల్ ఆధారంగా పోలీసులు ఛేదించారు. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో బాలిక కనిపించకుండా పోయిన రోజున ఆమె తల్లికి తెలియని నెంబర్ నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. ఫిబ్రవరి 9న ఉదయం 11.50 గంటలకు ఆమె తల్లికి మిస్డ్ కాల్ వచ్చింది, ఆమె తిరిగి కాల్ చేసినప్పుడు, నంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆ తరువాత బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 12 రోజుల తర్వాత హత్యకు సంబంధించి రోహిత్ అలియాస్ వినోద్ అనే 21 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Kondagattu Temple: కొండగట్టు ఆలయంలో చోరీ.. బంగారు నగలతో పాటు విగ్రహాలు మాయం

ఫిబ్రవరి 9న ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తన కూతురు స్కూల్ బస్సులో వెళ్లిందని బాధితురాలి తల్లి తెలిపింది. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో తమ కుమార్తె కిడ్నాప్‌కు గురైందని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరి 10న కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

మిస్డ్ కాల్ ఆధారంగా విచారణ ప్రారంభించిన పోలీసులు, మొబైల్ నంబర్ ను ట్రాక్ చేసి పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించారు. ఫిబ్రవరి 21న నిందితుడి పట్టుకుని విచారించగా.. ఫిబ్రవరి 9న బాలికను హత్య చేసి శవాన్ని ఘోవ్రా మోర్ సమీపంలో పడేసినట్లు వెల్లడించారు. ముండ్కా గ్రామంలో కుళ్లిపోయిన స్థితిలో బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా నిందితుడు మృతదేహాన్ని పడేసిన చోటులో ఫోరెన్సిక్ టీం సాక్ష్యాలను సేకరించింది. నిందితుడిని రిమాండ్ నిమిత్తం జైలుకు పంపించారు. ఈ కేసులో హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బాలికపై లైంగిక వేధింపులు జరిగాయా..? అనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తెలియనుంది.

Exit mobile version