NTV Telugu Site icon

Termination Of Pregnancy: గర్భం రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన 14 ఏళ్ల బాలిక

Minor Pregnancy

Minor Pregnancy

Minor Moves Delhi High Court For Termination Of 16-Week Pregnancy: తన గర్భాన్ని రద్దు చేయాలని కోరుతూ 14 ఏళ్ల మైనర్ తన తల్లి సహాయంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మైనర్ అయిన బాలిక, మరో మైనర్ బాలుడు లైంగిక చర్య ద్వారా గర్భాన్ని దాల్చింది. దీంతో వైద్యపరంగా తన గర్భాన్ని రద్దు చేయాలని చెబుతూ కోర్టును ఆశ్రయించింది. బాలిక, బాలుడు ఏకాభిప్రాయం ద్వారా లైంగిక చర్యలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఈ వ్యాజ్యం బుధవారం జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ ధర్మాసనం ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయకుండా గర్భాన్ని తొలగించాలని కోరుతూ బాలిక తల్లి న్యాయవాది అమిత్ మిశ్రా ద్వారా పిటిషన్ దాఖలు చేశారు.

Read Also: Ind vs SL : కెప్టెన్ ఇన్నింగ్స్ వృథా.. తొలి వన్డేలో శ్రీలంకపై భారత్ ఘన విజయం

బాలిక మైనర్ అని.. అబ్బాయితో సన్నిహితంగా మెలిగిందని సమాచారం. పోక్సో చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉన్నా.. ఇది సామాజికంగా కళంకం, వేధింపులకు గురిచేస్తుందని, మొత్తం కుటుంబానికి చెడ్డపేరు తెస్తుందని పిటిషన్ లో పేర్కొన్నారు. బిడ్డను పెంచేందుకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా లేనందున గర్భాన్ని కొనసాగించేందుకు బాలిక ఇష్టపడడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. బాలిక మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని పిటిషన్ లో తెలిపారు. ఏదైనా ప్రభుత్వ ఆస్పత్రిలో కానీ, ఢిల్లీ ఎయిమ్స్ లో గర్భాన్ని తొలగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును ప్రార్థించారు.

గర్భం కొనసాగించడం వల్ల స్త్రీ జీవితానికి ప్రమాదం లేదా..శారీరక, మానసిక ఇబ్బందులు తలెత్తున్నట్లు భావిస్తే.. ఎంటీపీ చట్టం ప్రకారం 20 వారాల గర్భం రద్దుకు అనుమతిస్తుందని కోర్టుకు విన్నవించారు. జనవరి 6, 2023 నాటికి బాలిక 15 వారాల 4 రోజులని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ప్రస్తావించారు. పోక్సో చట్టం సెక్షన్ 19 ప్రకారం ఏకాభిప్రాయంతో లైంగిక చర్యలో పాల్గొని మైనర్ గర్భం దాలిస్తే స్థానిక పోలీసులు, డాక్టర్లకు తెలియజేయడాన్ని మినహాయిస్తూ సుప్రీం తీర్పును ఇచ్చింది.