Site icon NTV Telugu

Pakistan: ఒకే వేదికపై లష్కరే ఉగ్రవాదులతో మంత్రులు.. పాక్ టెర్రర్ లింకులు బహిర్గతం..

Pakistan

Pakistan

Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వం, ఉగ్రవాదులకు మధ్య ఉన్న సంబంధాలు మరోసారి బహిర్గమయ్యాయి. భారత్ ఎంతో కాలంగా పాకిస్తాన్ ప్రభుత్వమే ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేస్తుందని చెబుతోంది. తాజాగా, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్ జిల్లాలో మే 28న జరిగిన భారత వ్యతిరేక ర్యాలీలో పంజాబ్ ప్రావిన్స్ మంత్రులతో లష్కరే తోయిబా ఉగ్రవాదులు వేదికను పంచుకున్నారు. పాకిస్తాన్ అణు పరీక్షలకు గుర్తుగా యూమ్-ఏ-తక్బీర్ కార్యక్రమంలో వీరంతా తమ భారత వ్యతిరేకతను వ్యక్తం చేశారు.

పాకిస్తాన్ ఆహార మంత్రి మాలిక్ రషీద్ అహ్మద్ ఖాన్, పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ ముహమ్మద్ అహ్మద్ ఖాన్ ఇద్దరూ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్ లకు అత్యంత సన్నిహితులు. వీరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు సైఫుల్లా కసూరి, తల్హా సయీద్ (హఫీజ్ సయీద్ కుమారుడు) మరియు అమీర్ హంజా వంటి వారితో వేదికను పంచుకున్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. భారతదేశంపై విషం కక్కారు. నిఘావర్గాలు ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారిగా సైఫుల్లా కసూరిని భావిస్తున్నారు.

Read Also: Russia: చైనా వ్యతిరేక కుట్రతో భారత్‌ను నాటో ఆకర్షిస్తోంది.. ఆర్ఐసీ పునరుద్ధరణపై రష్యా..

మంత్రి మాలిక్ రషీద్ మాట్లాడుతూ.. నేడు 24 కోట్ల మంది పాకిస్థానీలకు సైఫుల్లా కసూరి, హఫీజ్ సయీద్ వంటి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారని బహిరంగంగానే ప్రకటించారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్, పీఓకేలోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి జరిపింది. దీంతో మురిడ్కే కూడా ఒకటి. మురిడ్కే దాడిలో కీలకమైన ఉగ్రవాది లష్కర్ కమాండర్ ముదాసిర్ హతమయ్యాడు. ఇతడి సోదరుడికి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందని కూడా ఆయన ప్రకటించారు.

సైఫుల్లా కసూరి మాట్లాడుతూ, పహల్గామ్ ఉగ్రవాద దాడికి సూత్రధాని అని నన్ను నిందించారు, ఇప్పుడు నా పేరు ప్రపంచానికి తెలిసిందని అని గర్వంగా చెప్పుకున్నాడు. కసూరీని పాకిస్తాన్ ఐఎస్ఐ రక్షిస్తోంది. ఈ కార్యక్రమంలో భారత వ్యతిరేక, ఖలిస్తానీ అనుకూల నినాదాలు ప్రతిధ్వనించాయి. లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ఉగ్రవాది అమీర్ హంజా వేదికపై నుంచి ఖలిస్తానీ అనుకూల నినాదాలను లేవనెత్తాడు. భారత్‌లో ఖలిస్తాన్ పేరుతో అశాంతిని రెచ్చగొట్టాలనే కుట్రకు తెరలేపాడు. మరోవైపు, రావల్పిండిలో జరిగిన ర్యాలీలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ ఫోటోలను ప్రదర్శించారు.

Exit mobile version