NTV Telugu Site icon

PM Modi US Visit: ప్రధాని మోడీకి వైట్‌హౌజ్‌లో విందు.. నోరూరించే మెనూ ఇదే..

Pm Modi Us Visit

Pm Modi Us Visit

PM Modi US Visit: ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, అతని సతీమణి, ప్రథమ మహిళ జిల్ బైడెన్ వైట్‌హౌజ్‌లోకి ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోడీకి స్టేట్ డిన్నర్ ఇవ్వనున్నారు బైడెన్ దంపతులు. జూన్ 21 నుంచి 23 వరకు ప్రధాని అమెరికాలో పర్యటిస్తారు. అమెరికాలో ప్రధాని పర్యటన బిజీబీజీగా కొనసాగుతోంది. ఈ మేరకు ప్రధాని మోడీ విందులోని మెనూపై అందరి ఆసక్తి నెలకొంది. మోడీ శాకాహారి కావడంతో అందుకు తగ్గట్లుగా వంటలు ప్రిపేర్ చేయాల్సింది జిల్ బైడెన్ వైట్ హౌజ్ చెఫ్ నినా కర్టిస్‌ను కోరారు. వెజిటేరియన్ ఫుడ్ లో నినా కర్టిస్ కు మంచి ప్రావీణ్యం ఉంది.

Read Also: Earthquake: మయన్మార్‌లో వరస మూడు భూకంపాలు..

విందుకు ముందు జిల్ బైడెన్ ఏర్పాట్లను మీడియాకు వివరించారు. జాతీయ పక్షి నెమలి నుంచి ప్రేరణ పొందిన థీమ్ నుంచి త్రివర్ణ పతాకాన్ని సూచించేలా డెకరేట్ చేశారు. భారతీయ రుచులతో ఈ వంటకాలను రూపొందించినట్లు తెలుస్తోంది. మోనూలో ముఖ్యంగా మిల్లెట్స్ తో వంటకాలు చేశారు.

మెనూ ఇదే..

ఫస్ట్ కోర్స్: మెరినేట్ చేసిన మిల్లెట్, గ్రిల్డ్ కార్న్ కెర్నల్ సలాడ్, కంప్రెస్డ్ వాటర్ మిలాన్, టాంగీ అవోకాడో సాస్.

మెయిన్ కోర్స్: స్టఫ్డ్ పోర్టోబెల్లో మష్రూమ్స్, క్రీమీ సఫ్రాన్ రిసోట్టో, సుమాక్ రోస్టెడ్ సీ బాస్, లెమన్-డిల్ యోగర్ట్ సాస్, మిల్లెట్ కేక్స్, సమ్మర్ స్వాషెస్

అంతర్జాతీయ మిల్లెట్ ఇయర్ జరుపుకోవడానికి భారత్ నాయకత్వం వహిస్తున్నందుకు, మా మెనూలో మెరినేట్ చేసిన మిల్లెట్స్ చేర్చామని చెఫ్ నినా కర్టిస్ చెప్పారు.