Milind Deora: పహల్గామ్ ఉగ్రదాడితో దేశం మొత్తం ఆగ్రహావేశాలతో ఉంటే, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన కుటుంబంతో యూరప్‌లో సెలవులు గడిపేందుకు వెళ్లారని శివసేన నేత మిలింద్ దేవరా ఘాటు విమర్శలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో ఉద్ధవ్ ఠాక్రే యూరప్‌లో హాలీడేస్ గడుపుతున్నారని మండిపడ్డారు.
Read Also: Viral Video: వీరి యాక్టింగ్ ముందు చాలామంది హీరోహీరోయిన్స్ కూడా పనికిరారుగా..?!
మహారాష్ట్ర దినోత్సవం రోజు, వారు ఒక్క మాట కూడా చెప్పకుండా అదృశ్యమయ్యారు. ఒక్క ప్రకటన, సంఘీభావం లేదు, సిగ్గు లేదు అంటూ విరుచుకుపడ్డారు. బాధితులకు, వారి కుటుంబాలకు సాయం చేయడానికి క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న వివిధ రాజకీయ నేతలను, ముఖ్యంగా శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే కృషిని మిలింద్ దేవరా కొనియాడారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ కేవలం సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితమైందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష్ సమావేశానికి కూడా శివసేన(యూబీటీ) సభ్యులు ఎవరూ హాజరు కాలేదని అన్నారు.
మే 1న మహారాష్ట్ర వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్న రోజున ఉద్ధవ్ ఠాక్రే లేకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఉద్ధవ్ ఠాక్రే తన మరాఠీ గుర్తింపును నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని బీజేపీ ముంబై చీఫ్, మహారాష్ట్ర సాంస్కృతిక మంత్రి ఆశిష్ షెలార్ ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన మహారాష్ట్రకు చెందిన ఆరుగురు కుటుంబాలకు దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మహారాష్ట్ర బాధితుల బంధువులకు ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది.
