BMW Hit-And-Run: యాక్సిడెంట్‌కి ముందు 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగిని నిందితుడు మిహిర్‌షా..
- సంచలనంగా మారిన ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసు..
- యాక్సిడెంట్‌కి ముందు 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగిన నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMW Hit-And-Run: ముంబై బీఎండబ్ల్యూ హిట్ అండ్ రన్ కేసుల సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం ముంబైలోని వర్లీ ప్రాంతంలో నిందితుడు మిహిర్ షా కారును వేగంగా నడిపి కావేరీ నక్వా అనే 45 ఏళ్ల మహిళ మరణానికి కారణమయ్యారు. చేపల వ్యాపారి అయిన కావేరీ తన భర్తతో కలిసి స్కూటర్‌పై వస్తున్న సమయంలో కారుతో ఢీకొట్టి బాధితురాలని 1.5 కి.మీ ఈడ్చుకెళ్లాడు. ఈ ప్రమాదంలో ఆమె చనిపోయింది. ఈ వ్యవహారం మహారాష్ట్రలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. నిందితుడి తండ్రి అధికార శివసేన పార్టీకి పాల్ఘర్ జిల్లా డిప్యూటీ చీఫ్‌గా ఉన్నారు. అయితే, ఈ వ్యవహారంలో శివసేన అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
Read Also: Shaheen Afridi-PCB: చిక్కుల్లో పాకిస్తాన్ పేసర్ షహీన్ అఫ్రిది!
Also Read
24 ఏళ్ల మిహిర్ షా తన ఇద్దరు స్నేహితులతో కలిసి స్థానిక బార్‌లో 12 లార్జ్ విస్కీ పెగ్గులు తాగినట్లు పోలీసులు తెలిపారు. విపరీతంగా మద్యం తాగి కారు నడిపిన మిహిర్, తన కారు కింద బాధితురాలి శరీరం చిక్కుకున్నదనే విషయం తెలసి కూడా అలాగే డ్రైవ్ చేసినట్లు పోలీసుల వర్గాలు తెలిపాయి. స్థానికులు అరుస్తున్నప్పటికీ అతను పట్టించుకోలేదని చెప్పారు. మిహిర్ మరియు అతని డ్రైవర్ రాజర్షి బిదావత్ కొంత దూరంలో కారు ఆపి మృతదేహాన్ని పారేసే ప్రయత్నం చేశారు. సాక్ష్యాలను మార్చడానికి ప్రయత్నించారు.ఈ ఘటనలో 72 గంటల తర్వాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
అయితే, విచారణ సమయంలో తాను యాక్సిడెంట్ చేసినట్లు అంగీకరించినప్పటికీ, మద్యం సేవించినట్లు అంగీకరించలేదు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో ప్రోటోకాల్ ప్రకారం తాగిన 12 గంటల్లో పరీక్షలు నిర్వహిస్తారు. నిందితుడు మూడు రోజుల తర్వాత అరెస్ట్ కావడంతో ఈ టెస్టులు పనికిరాకుండా పోయాయి. ముంబై మద్యపాన కనీస వయసు 25 ఏళ్లు గకాగా, నిందితుడికి 24 ఏళ్ల ఉన్నాయి. దీంతో బార్ యాజమాన్యంపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మిహిర్ తనకు 27 ఏళ్లు అని తప్పుడు ఐడీ కార్డు చూపించినట్లు బార్ పేర్కొంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?