Site icon NTV Telugu

Bill Gates: ఎప్‌స్టీన్ ఫైల్ ఎఫెక్ట్.. ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌‌కు బిల్ గేట్స్ దూరం

Bill Gates

Bill Gates

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. సోమవారమే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌‌ కూడా జరుగుతోంది. దిగ్గజ కంపెనీల సీఈవోలు, ఆయా దేశాధినేతలంతా హాజరవుతున్నారు. కానీ ఈ సమ్మిట్‌కు బిల్ గేట్స్ హాజరు కావడం లేదని వర్గాలు పేర్కొన్నాయి. దీనికి ఎప్‌స్టీన్ ఫైలే కారణంగా తెలుస్తోంది.

ఇటీవలే అమెరికా న్యాయ శాఖ ఎప్‌స్టీన్ ఫైల్ విడుదల చేసింది. ఇందులో బిల్ గేట్స్ రష్యన్ అమ్మాయిలతో సంబంధాలు కలిగి ఉన్నారని.. సుఖ వ్యాధులు కూడా ఉన్నట్లుగా వెల్లడైంది. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ వ్యవహారంపై మాజీ భార్య మిలిందా గేట్స్ కూడా స్పందిస్తూ.. ఆ కారణం చేతనే విడాకులు తీసుకున్నట్లు చెప్పారు.

ఇక ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారీగా ట్రోల్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగే సమ్మిట్‌కు వెళ్లకూడదని బిల్ గేట్స్ నిర్ణయం తీసుకున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఆయన పర్యటన కూడా ఖరారు కాలేదు. దీంతో హాజరు కావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version