NTV Telugu Site icon

MIB: ‘‘రక్షణ కార్యకలాపాల కవరేజ్‌ని ఆపేయండి’’.. మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు..

India

India

MIB: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గత నాలుగు రోజుల నుంచి ఇటు భారత్, అటు పాకిస్తాన్ మీడియా ఛానెళ్లలో ఇదే ప్రధానాంశంగా మారింది. భారత మీడియా మిలిటరీ కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు నివేదిస్తోంది. ఇదిలా ఉంటే, మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన కవరేజ్‌ని నిలిపేయాలని శనివారం సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) మీడియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Pakistan: పాకిస్తాన్ ఆర్మీలో భయం భయం.. కుటుంబాలను యూకే తరలిస్తున్న అధికారులు..

టెలివిజన్ ఛానెల్‌లు, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు సోషల్ మీడియా యూజర్లను ఉద్దేశించి కీలక అడ్వైజరీని జారీ చేసింది. జాతీయ భద్రతకు సంబంధించి రాజీ పడేలా సున్నితమైన కార్యచరణ వివరాలను రక్షించాల్సిన అవసరాన్ని కేంద్ర నొక్కిచెప్పింది. “జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వార్తా సంస్థలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు అత్యంత బాధ్యత వహించాలని, సంబంధిత కార్యాచరణ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు” మంత్రిత్వ శాఖ తన రెండు పేజీల లేఖలో పేర్కొంది.

“ముఖ్యంగా, రక్షణ కార్యకలాపాలు లేదా కదలికలకు సంబంధించిన “సోర్స్ బేస్డ్” సమాచారం ఆధారంగా రియల్-టైమ్ కవరేజ్, విజువల్స్ వ్యాప్తి లేదా నివేదించడం చేపట్టకూడదు. సున్నితమైన సమాచారాన్ని ముందస్తుగా బహిర్గతం చేయడం వల్ల అనుకోకుండా శత్రు అంశాలకు సహాయపడవచ్చు , ఆపరేషన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. సిబ్బంది భద్రతకు హాని కలిగించవచ్చు” అని చెప్పింది.