అసని తుఫాన్ క్రమంగా తీరం వైపు దూసుకొస్తోంది.. ఆ ప్రభావంతో ఇప్పటికే ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి.. అయితే, అసని తుఫాన్‌పై కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు.. ఆంధ్రప్రదేశ్, ఒడిశాపై ‘అసని’ తుఫాన్ ప్రభావం, దానిని ఎదుర్కోవడానికి సన్నద్ధతపై వివిధ విభాగాల అధికారులతో సమీక్ష జరిగింది.. తుఫాన్ రేపు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కాకినాడ-విశాఖపట్నం తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉందని.. కాకినాడ, విశాఖపట్నం, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై తుఫాన్ ప్రభావం ఉంటుందని ఇప్పటికే ఐఎండీ తెలిపింది.. తుఫాన్ ప్రభావంతో ఆంధ్రా తీరంలో గంటకు 75 నుంచి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
Read Also: Cyclone Asani: దిశ మార్చుకున్న ‘అసని’ తుఫాన్
ఇక, ఒడిశా తీరంలో గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండగా.. చేపల వేట కార్యకలాపాలను నిలిపివేయాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.. ఆంధ్రప్రదేశ్‌లో 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించగా.. మరో 7 బృందాలను సన్నద్ధంగా ఉంచింది ఎన్డీఆర్‌ఎఫ్.. ఒడిశా తీరంలో ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం మోహరించి.. మరో 17 బృందాలను స్టాండ్‌బైలో ఉంచారు.. పశ్చిమ బెంగాల్‌లో 12 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మోహరించగా.. మరో ఐదు బృందాలను సన్నద్ధంగా ఉంచినట్టు ఎన్డీఆర్‌ఎఫ్ పేర్కొంది. అవసరమైతే అదనపు బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయని వెల్లడించింది. ఇక, తుఫాన్ పరిస్థితులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని కేంద్ర మంత్రిత్వ శాఖలులను ఆదేశించారు కేంద్ర హోం శాఖ కార్యదర్శి.