G20 Speakers Meet: ఈ నెల 8 నుంచి 10 వరకు దేశ రాజధాని న్యూఢిల్లీలో జీ-20 దేశాల సమ్మిట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 8 నుంచి 10 వరకు మూడు రోజులు ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు సైతం సెలవులు ప్రకటించారు. జీ-20 దేశాల సమావేశాల అనంతరం మరో అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహించడానికి కేంద్రం సిద్ధమయింది. అదే పీ-20 పార్లమెంట్ స్పీకర్ల సమావేశం. జీ-20 కూటమి దేశాల పార్లమెంట్ స్పీకర్ల సమావేశం వచ్చే నెలలో ఢిల్లీలో జరగనుంది. అక్టోబర్ 12, 13, 14వ తేదీల్లో పార్లమెంట్ నూతన భవనం పీ–20 పార్లమెంట్ స్పీకర్ల భేటీకి వేదిక కానుందని జీ20 ఇండియా స్పెషల్ సెక్రటరీ ముక్తేశ్ పర్దేశి చెప్పారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాల పార్లమెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాల్గొని చర్చలు జరుపుతారని తెలిపారు.
Read Also: Software Deepthi: సాఫ్ట్‌వేర్ దీప్తి కేసు.. అదుపులో చెల్లి చందన, ఆమె ప్రియుడు
“ఇది అన్ని G20 దేశాలు మరియు ఆహ్వానిత దేశాల నుండి పార్లమెంటు స్పీకర్‌లు మరియు ప్రిసైడింగ్ అధికారులకు సంబంధించిన సమావేశం. ఇది అక్టోబర్ 12 మరియు 14 మధ్య కొత్త పార్లమెంటు భవనంలో జరుగుతుంది” అని ఆయన చెప్పారు. “ప్రజాస్వామ్యానికి తల్లిగా భారతదేశం ప్రధాన కథనాల్లో ఒకటి. కాబట్టి, ఆ రోజుల్లో ఢిల్లీలో పార్లమెంటు స్పీకర్‌లు దిగినప్పుడు, మా చర్చల ద్వారా కీలక సందేశం రూపొందించనున్నామని.. దానిని బహిర్గతపరుస్తామని పరదేశి అన్నారు.‘పార్లమెంటేరియన్లు సంబంధిత ప్రభుత్వాలకు మార్గనిర్దేశం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు కాబట్టి, పీ20 సమావేశాలు ప్రపంచ పాలనకు పార్లమెంటరీ కోణాన్ని తీసుకురావడం, అవగాహన పెంచడం, అంతర్జాతీయ నిబంధనలకు రాజకీయ మద్దతును సాధించడం, వీటిని సమర్థంగా కార్యరూపం దాల్చేలా చేయడమే ఈ సమావేశాల లక్ష్యం’అనిముక్తేశ్ వివరించారు. భారత్‌ను ప్రజాస్వామ్యానికి తల్లిగా చూపేందుకు ఉద్దేశించిన ఒక ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. 2010లో జీ20 అధ్యక్ష స్థానంలో కెనడా ఉన్నప్పటి నుంచి పీ20 గ్రూప్ భేటీలు జరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన .. ఆ క్రమంలో ఇది 9వ సమావేశం అని తెలిపారు.