NTV Telugu Site icon

UP: రోడ్లపై “నమాజ్” చేస్తే పాస్‌పోర్టు, లైసెన్సులు రద్దు.. యూపీ పోలీసుల వార్నింగ్..

Meerut Police

Meerut Police

UP: రంజాన్ పండగ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, మీరట్ ఎస్పీ విపిన్ టాడా బుధవారం కీలక సూచనలు జారీ చేశారు. ముస్లిం మతాధికారులు, మత పెద్దలు తమ సమీప మసీదులు, ఈద్గాలలో మాత్రమే నమాజ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై నమాజ్ చేయడానికి అనుమతి లేదని అన్నారు.

Read Also: Robinhood : భీష్మ కంటే రాబిన్ హుడ్ బెస్ట్ ఎంటర్ టైనర్ గా ఉంటుందిః నితిన్

గతేడాది రోడ్లపై నమాజ్ చేసినందుకు దాదాపుగా 200 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ ఏడాది ఈద్ సందర్భంగా డ్రోన్ నిఘా, సీసీటీవీ, స్థానిక నిఘా సాయంతో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎవరైనా రోడ్లపై నమాజ్ చేస్తే కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు. ఒక్కసారి కేసు నమోదైతే కోర్టు నుంచి క్లీన్ చిట్ లభించే వరకు పాస్‌పోర్ట్, లైసెన్స్ క్యాన్సల్ చేస్తామని చెప్పారు. సున్నిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు అదనపు బలగాలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31న రంజాన్ జరిగే అవకాశం ఉంది.