Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- మీరట్ ‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో కీలక తీర్పు
- ముస్కాన్ రస్తోగీ, సాహిల్ శుక్లా దోషులుగా కోర్టు నిర్ధారణ
- సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో దోషులుగా తేల్చిన కోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerut Blue Drum Murder: దేశ వ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించిన మీరట్ ‘‘బ్లూ డ్రమ్ హత్య’’ కేసులో కోర్టు కీలక తీర్పు చెప్పింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను చంపిన భార్య ముస్కాన్ రస్తోడి, ఆమె ప్రియుడు సాహిల్‌లను దోషులుగా తేల్చింది. అయితే, వీరికి ఇంకా శిక్షలు నిర్ధారించలేదు. బుధవారం నిందితులు ఇద్దరిని కోర్టు దోషులుగా నిర్ధారించినట్లు ప్రాసిక్యూషన్ న్యాయవాది కేకే చౌబే వెల్లడించారు. హత్య, హత్యకు సంబంధించి సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరిని కోర్టు దోషులుగా గుర్తించింది. 15 రోజుల్లో శిక్షలు ఖరారయ్యే అవకాశం ఉంది.
మార్చి 3, 2025లో ముస్కాన్ రస్తోడి, సాహిల్ కలిసి సౌరభ్ రాజ్‌పుత్‌ను హత్య చేసి, అతడి శరీర భాగాలను ముక్కలు చేసి, ఒక బ్లూ డ్రమ్‌లో వేసి దానిని సిమెంట్‌తో ప్యాక్ చేశారు. 15 రోజుల తర్వాత ఈ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. జూలై 2025లో జిల్లా జడ్జి కోర్టులో విచారణ ప్రారంభమైంది. పోలీసులు దాదాపు 1,000 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు. 126 తేదీలలో విచారణలు జరిగాయి మరియు 22 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. సుదీర్ఘ విచారనణ తర్వాత, సెప్టెంబర్ 19న కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.
Also Read
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
లండన్ నుంచి వచ్చిన భర్తను చంపేశారు..
సౌరభ్ రాజ్‌పుత్ 2025 ఫిబ్రవరి 24న లండన్ నుంచి మీరట్ తిరిగి వచ్చారు. ఆయన లండన్‌లో మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. సౌరభ్ తిరిగి వచ్చిన తర్వాత రోజు ముస్కాన్ ఇంట్లో పెద్ద పార్టీ ఇచ్చింది. ఫిబ్రవరి 28న కుమార్తె పీహు పుట్టిన రోజు జరిగింది. ఆ తర్వాత మార్చి 3న ముస్కాన్ సౌరభ్ ఆహారంలో నిద్ర మాత్రలు కలిపింది. ఆ తర్వాత సాహిల్ శుక్లా సహాయంతో శరీరాన్ని నాలుగు ముక్కలు చేసి, ఒక నీలి రంగు డ్రమ్‌లో ప్యాక్ చేసి సిమెంట్‌తో కప్పేశారు.
మార్చి 4న, కుమార్తె పీహూను వాళ్ల అమ్మమ్మ ఇంట్లో వదిలేసి సాహిత్లో ముస్కాన్ హిమాచల్ ప్రదేశ్ వెళ్లింది. మార్చి 17న ముస్కాన్ ఇంట్లో జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత మార్చి 18న పోలీసులు డ్రమ్ములో సౌరభ్ మృతదేహాన్ని కనుగొన్నారు.
కోర్టులో కీలక సాక్ష్యాలు..
ఈ కేసులో నీలి రంగు డ్రమ్ము, ట్రాలీ బ్యాగ్ ఆధారాలుగా మారాయి. వీటిని కోర్టులో ప్రవేశపెట్టారు. దీని తర్వాత 2026లో వీరిద్దరి కాల్ వివరాలు, చాట్ హిస్టరీ, మొబైల్ లొకేషన్ సమాచారంతో కోర్టుకు నివేదిక సమర్పించారు. ఏప్రిల్ 21న ముస్కాన్, సాహిల్ లపై ఆరోపణలను కోర్టు విచారించింది. 32 ఏళ్ల జైలు శిక్ష పడే ఈ ఆరోపనల్ని ఇద్దరూ అంగీకరించారు. పోలీసులు 34 మంది సాక్షుల పేర్లతో 1,000 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.సౌరభ్ సోదరుడు బబ్లూ కోర్టులో సాక్ష్యం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు, వైద్యులు, డ్రమ్ అమ్మేవారు ఇలా అందరి సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని దోషులుగా కోర్టు నిర్దారించింది.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!