NTV Telugu Site icon

Mayawati: బంగ్లాదేశ్ హిందువుల పరిస్థితికి కాంగ్రెస్ కారణం.. ఇప్పుడు ముస్లిం ఓట్ల కోసం..

Matyawari

Matyawari

Mayawati: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి స్పందించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితికి కాంగ్రెస్ కారణమని ఆరోపించారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ఆమె.. రాజ్యాంగ సభకు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్‌ని ఎన్నుకున్నందుకు శిక్షగా, హిందూ మెజారిటీ ప్రాంతం అయినప్పటికీ కాంగ్రెస్ బెంగాల్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చిందని ఆరోపించారు. ఆ తర్వాత ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌లో భాగమైందని చెప్పారు.

Read Also: Minister Atchannaidu: ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్‌ స్థాయి విద్య.. క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాలు..

కాంగ్రెస్ ముస్లింలను బుజ్జగిస్తోందని మాయావతి మండిపడ్డారు. సంభాల్ మసీదు సమస్యని లేవనెత్తడాన్ని ఆమె ప్రస్తావించారు. పొరుగుదేశంలో హిందువులపై పెద్ద సంఖ్యలో అఘాయిత్యాలు జరిగి బలవుతున్నారని, వారిలో దళితులు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉండి, ఇప్పుడు సంభాల్, సంభాల్ అంటూ ముస్లిం ఓట్ల కోసం అరుస్తోందని విమర్శించారు.

సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీ కాంగ్రెస్‌కి సహకరిస్తుందని దుయ్యబట్టారు. హిందువులను బంగ్లాదేశ్ నుంచి తీసుకురావాలని ఆమె కోరారు. వారి భద్రతకు హామీ ఇవ్వకపోతే, అక్కడి హిందువులను వెంటనే వెనక్కి తీసుకురావానలి ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్, ఎస్పీలు నాణేనానికి రెండు ముఖాలని, ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నేతృత్వంలోని కేంద్రం తన బాధ్యతల్ని నిర్వర్తించాలని కోరారు. కాంగ్రెస్ వల్లే బంగ్లాదేశ్ హిందువులు నష్టపోయారంటూ మండిపడ్డారు.

Show comments