NTV Telugu Site icon

Nitish Kumar: నోరుజారిన నితీష్ కుమార్.. “మోడీ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ”..

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ నోరు జారారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అనుకోకుండా ప్రధాని నరేంద్రమోడీ మళ్లీ ‘ముఖ్యమంత్రి’ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పాట్నాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ మేము భారత్ అంతటా 400 సీట్లకు పై గెలవాలని అనుకుంటున్నాము. నరేంద్ర మోడీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి, అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది, బీహార్ అభివృద్ధి చెందుతుంది, ప్రతిదీ జరుగుతుంది’’ అని అన్నారు.

Read Also: Rajnath Singh: ‘‘వర్క్ ఫ్రం హోమ్’’ విన్నా, కానీ తొలిసారి ‘‘వర్క్ ఫ్రం జైల్’’ వింటున్నా..

అయితే, ఈ వ్యాఖ్యలపై వెంటనే సర్దుకుని, నరేంద్రమోడీ మళ్లీ ప్రధాని అవుతారని అన్నారు. ‘‘నరేంద్రమోడీ ప్రధానిగా ఉన్నారు. ఇలాగే ముందుకు సాగుతారు. అనే నాకు కావాలి’’అని నితీష్ కుమార్ అన్నారు. ఇటీవల పలు సందర్భాల్లో నితీష్ కుమార్ నోరుజారారు. ఇటీవల 2020లో మరణించిన రామ్ విలాస్ పాశ్వాన్‌కి ఓట్లు వేయాలని కోరారు.

బీహార్‌లోని 40 స్థానాల్లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. 2019లో ఈ కూటమి ఏకంగా 39 స్థానాలను కైవసం చేసుకుంది. మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని ఎన్డీయే భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్-ఆర్జేడీ-లెఫ్ట్ పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి.