NTV Telugu Site icon

Mallikarjun Kharge: బీజేపీ భారత్‌ని ప్రేమించొచ్చు, కానీ పాకిస్తాన్‌ని పెళ్లి చేసుకుంది..

Mallikarjun Kharge

Mallikarjun Kharge

Mallikarjun Kharge: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలకు కారణమవుతున్నాయి. కాంగ్రెస్-ఎన్సీ పొత్తుపై బీజేపీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జన ఖర్గే ప్రతిస్పందించారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ,హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రధాని మోడీ, అమిత్ షాలు ఇటీవల మాట్లాడుతూ.. కాంగ్రెస్-ఎన్సీ కూటమి పాకిస్తాన్ ప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకుందని ఆరోపించారు.

బీజేపీ ఆరోపణల్ని ఖర్గే తిప్పికొట్టారు. ‘‘బీజేపీ భారత్‌ని ప్రేమించవచ్చు, కానీ అది పాకిస్తాన్‌ని వివాహం చేసుకుంది’’ అని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి పైనే దృష్టి పెట్టిందని, పాకిస్తాన్‌తో ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. జమ్మూలో జరిగిన విలేకరుల సమావేశంలో ఖర్గే 2015లో ప్రధాని మోడీ పాకిస్తాన్‌ పర్యటనను ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ బిర్యాని తిని కౌగిలించుకునేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ వెళ్లలేదని ఖర్గే అన్నారు. ప్రధాని మోడీ, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ని కౌగిలించుకోవడాన్ని ప్రస్తావించారు.

Read Also: Off The Record: ఆ జిల్లాపై బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు ఫోకస్ పెట్టింది..?

మోడీ, అమిత్ షా చెప్పేవన్ని అబద్ధాలే అని అన్నారు. 10 ఏళ్లుగా కేంద్రం నియమించిన గవర్నర్ జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నాడు, వారిచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు..? అని బీజేపీని ప్రశ్నించారు. కాశ్మీర్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని, ఇది లోయలో మళ్లీ హింసకు దారి తీస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కాశ్మీర్ ప్రజలను హెచ్చరించారు. కాంగ్రెస్‌కి వేసిన ఓటు పీడీపీ, ఎన్సీల హామీలను అమలు చేస్తుందని, వారు ఆర్టికల్ 370ని తిరిగి తీసుకురావాలని అనునకుంటున్నారని, లోయలో రక్తపాతాన్ని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు.

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పొత్తు పాకిస్తాన్‌కి చాలా ఆనందాన్ని ఇస్తోందని ప్రధాని ఆరోపించారు. లోయలో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడానికి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరియు కాంగ్రెస్-ఎన్‌సి కూటమి రెండూ కలిసి ఉన్నాయని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఆరోపించిన ఒక రోజు తర్వాత ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.