Site icon NTV Telugu

Big Breking: ముంబై లోయర్ పరేల్ ప్రాంతంలోని అవిగ్నాన్ పార్క్ భవనంలో మంటలు

Maharastra

Maharastra

Big Breking: మహారాష్ట్ర ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముంబైలోని ఓ రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అందులోని లోయర్ పరేల్ ప్రాంతంలోని అవిగ్నాన్ పార్క్ భవనంలో మంటలు చెలరేగాయి. అయితే.. భవనంలోని 22వ అంతస్తులో ఉదయం 10:45 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. స్థానిక సమాచారంతో నాలుగు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఫైర్‌ ఇంజన్లు సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ఇక అవిగ్నాన్ పార్క్ భవనంలో ఉన్న వారిని ఖాలీ చేయించారు. అందులో ఉన్న వారిని జాగ్రత్తగా కిందికి దించారు. అయితే ముందు జాగ్రత్తగా ఘటన స్థలంలో అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. కాగా.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్టుగా ఎటువంటి సమాచారం లేదు. అయితే.. అగ్నిప్రమాదం వల్ల దట్టమైన పొగ వెలువడుతుంది. అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అగ్నిప్రమాద సమయంలో అందులో ఎంతమంది ఉన్నారు? ఎలా మంటలు చెలరేగాయి? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. మంటల్లో ఎవరైనా చక్కుకున్నారా ఎటువంటి అరుపులు రాకపోవడంతో మంటల కారణంగా పొగ వెలువడటంతో సృహతప్పి పడిపోయారా? అనే కోణంలో విచరణ చేపట్టారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అవిగ్నాన్ పార్క్ భవనంలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Exit mobile version