NTV Telugu Site icon

Fire Accident: ఘజియాబాద్లోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..

Fire

Fire

దేశంలో అగ్ని ప్రమాదాలు భారీగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని చాందిని చౌక్ లో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరగ్గా, ఈరోజు ఉదయం తెల్లవారుజామున వసంత విహార్ లో మరో ప్రమాదం జరిగింది. అంతకుముందు కూడా.. దేశ రాజధానిలో భారీగానే అగ్ని ప్రమాదాలు జరిగాయి. అయితే.. దేశ వ్యాప్తంగా ఇంకా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు.

Read Also: Garlic Clove Benefits: పచ్చి వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుందో తెలుసా ?

ఇదిలా ఉంటే..ఘజియాబాద్‌లోని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. చాలా దూరం వరకు భారీగా పొగలు అలుముకున్నాయి. స్థానిక అగ్నిమాపక శాఖ అనేక అగ్నిమాపక వాహనాలను సంఘటనా స్థలానికి తరలించి మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టింది. అయితే.. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం గురించి తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంటలు అదుపు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Read Also: Delhi Fire Accident: ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.. 5 షాపులు దగ్ధం