Site icon NTV Telugu

Chhattisgarh: కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు మావోల హతం

Chhattisgarh1

Chhattisgarh1

దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్‌గఢ్ అభయారణ్యంలో రక్తపాతం జరిగింది. కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతం అయ్యారు. మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: PM Modi: డిజైన్.. అభివృద్ధి మా నినాదం.. ఏఐ దేశానికి గొప్ప అవకాశం అన్న మోడీ

ఆపరేషన్‌ కగార్‌ డెడ్‌లైన్‌‌కు ఇంకా 40 రోజులే మిగిలి ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేతకు కేంద్రం డెడ్‌లైన్ పెట్టుకుంది. దేశాన్ని మావోయిస్ట్ రహిత దేశంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గురువారం ఆపరేషన్‌-2 కగార్‌ పేరుతో కర్రెగుట్టలో కేంద్ర, రాష్ట్ర బలగాల కూంబింగ్ నిర్వహించాయి. దాదాపు 5000 మంది బలగాలతో అధికారులు ఆపరేషన్ నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే కర్రెగుట్టలోకి చొచ్చుకుపోయారు. CRPF బలగాలతో రాష్ట్ర బలగాలు కలిపి భారీ ఆపరేషన్ నిర్వహించారు. మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్‌గా కొనసాగుతోంది. ఇప్పటికి ఐదుగురు మావోలు హతం కాగా.. మరికొందరు లొంగుబాటుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

Exit mobile version