Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Mass Resignation At Rg Kar Hospital In Kolkata West Bengal

Kolkata: వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక పరిణామం.. 50 మంది సీనియర్ వైద్యుల రాజీనామా

Published Date :October 8, 2024 , 3:17 pm
By Suresh Maddala
  • కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక పరిణామం
  • 50 మంది సీనియర్ వైద్యుల రాజీనామా
  • జూడాల నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం
Kolkata: వైద్యురాలి హత్యాచార ఘటనలో కీలక పరిణామం.. 50 మంది సీనియర్ వైద్యుల రాజీనామా
  • Follow Us :
  • google news
  • dailyhunt

కోల్‌కతా వైద్యురాలి అత్యాచార ఘటన మరోసారి ఉధృతం అవుతోంది. ఆగస్టు 9న ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇక ఆమెకు మద్దతుగా జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనలు చేపడుతున్నారు. బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలు తాజాగా మరింత తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూనియర్‌ వైద్యులు చేపట్టిన నిరాహార దీక్షకు సీనియర్‌ వైద్యులు, ఫ్యాకల్టీ సభ్యులు కూడా మద్దతు ప్రకటించారు. మంగళవారం ఉదయం 15 మంది సీనియర్‌ వైద్యులు జూడాల నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించగా.. తాజాగా ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలోని 50 మంది సీనియర్‌ వైద్యులు, బోధనా సిబ్బంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు. రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కూడా చదవండి: Dhanush- Aishwarya: ఐశ్వర్య-ధనుష్‌ విడాకులు.. కోర్టుకు ఇద్దరూ డుమ్మా?

ఆగస్టు 9న వైద్యురాలు హత్యాచారానికి గురైన తర్వాత కోల్‌కతాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. నిరసనకారులు.. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అయినా తమ భద్రత విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సానుకూల చర్యలు తీసుకోలేదంటూ జూనియర్ వైద్యులు నిరవిధిక నిరాహార దీక్షకు పూనుకున్నారు. తాజాగా వీరికి మద్దతుగా సీనియర్ వైద్యులు కూడా సంఘీభావం తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరోసారి ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఇదిలా ఉంటే వైద్యుల నిరసనలు కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దసరా పండుగ నేపథ్యంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఇదిలా ఉంటే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. తాజాగా దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో సంజయ్ రాయ్ ఒక్కడినే నిందితుడిగా చూపించింది. అధికారులు పలువురిని విచారించినా.. ఎవరినీ నిందితులకు చేర్చలేదు.

ఇది కూడా చదవండి: Jiiva : మిడ్ రేంజ్ హీరోపై భారీ బడ్జెట్.. ఫస్ట్ లుక్ రిలీజ్

Breaking 🚨

Mass resignation at RG Kar Hospital.

Over 50 senior faculty resigns‼️

pic.twitter.com/6RU1ocGarn

— Shashank Shekhar Jha (@shashank_ssj) October 8, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kolkata
  • Kolkata doctor murder case
  • Mass Resignation
  • Rg kar hospital
  • West Bengal

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions