NTV Telugu Site icon

Masood Azhar: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కి గుండెపోటు..!

Masood Azhar

Masood Azhar

Masood Azhar: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్(జేఈఎం) చీఫ్ మౌలానా మసూద్ అజార్ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. భారతదేశంలో పుల్వామా వంటి ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా ఉన్న అజార్, మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టుల లిస్టులో ఉన్నాడు. అతడి ఆరోగ్యం క్షీణించిన సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాడని, చికిత్స కోసం పాకిస్తాన్ తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read Also: IND vs AUS: ముగిసిన నాల్గవ టెస్టు మొదటిరోజు ఆట.. ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా?

1999లో ఖాట్మాండు-న్యూఢిల్లీ ఇండియన్ ఎయిర్‌లైన్ విమానం IC-814 విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తరలించిన సమయంలో భారత్ మసూద్ అజార్‌ని విడుదల చేయాల్సి వచ్చింది. ఇతడు విడుదలైన తర్వాత పాకిస్తాన్‌లో ‘‘జైషే మహ్మద్’’ ఉగ్రసంస్థను స్థాపించాడు. ఆ తర్వాత ఈ ఉగ్రసంస్థ 2001లో భారత్ పార్లమెంట్‌పై దాడి చేసింది. 2016లో పఠాన్ కోట్ దాడి, 2019లో పుల్వామా దాడిలో ఇతడి ప్రమేయం ఉంది. భారత్ మసూద్ అజార్‌తో పాటు లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌ని కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం UAPA కింద ‘వ్యక్తిగత ఉగ్రవాదులు’గా పేర్కొంది.