NTV Telugu Site icon

Marital Rape: భార్యకు 18ఏళ్లు పైబడితే.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం

Marital Rape

Marital Rape

భార్యకు 18 సంవత్సరాలు నిండితే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ‘అసహజ నేరం’ కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్తను నిర్దోషిగా తేల్చింది. నిందితుడిని ఐపీసీ సెక్షన్ 377 కింద దోషిగా నిర్ధారించలేమని జస్టిస్ రామ్‌మనోహర్ నారాయణమిశ్రా ధర్మాసనం తెలిపింది.

Read Also: Allu Arjun: ఓ పుష్ప రాజ్ అన్నా… ఆయన అందరినీ ఎందుకు కలుస్తున్నాడో నువ్వైనా కనుక్కో కాస్త

ఇక, వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. అయితే, భార్యకు 18 ఏళ్లకు మించి ఉంటే వైవాహిక అత్యాచారానికి ఎలాంటి క్రిమినల్ పెనాల్టీ ఉండదని న్యాయస్థానం వెల్లడించింది. వైవాహిక బంధంలో ఎలాంటి ‘అసహజ నేరం’ జరిగే ఛాన్స్ లేదని మధ్యప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు గుర్తు చేసింది.

Read Also: Sonia Gandhi Birthday: తెలంగాణ తల్లి అంటే సోనియా గాంధీ..

అయితే, భర్త తనను దూషిస్తూ శారీరక వేధింపులకు గురిచేయడమే కాకుండా బలవంతంగా కలిసేందుకు ప్రయత్నం చేశాడని బాధిత మహిళ తన పిటిషన్‌లో పేర్కొంది. ఈ కేసును విచారించిన హైకోర్టు అభియోగాల నుంచి ఆమె భర్తకు విముక్తి దొరికింది. ఇక, బాధితుడితో పాటు అతడి బంధువులు ఆమెతో క్రూరంగా వ్యవహరించడం, గాయపరచడం లాంటి అభియోగాల్లో మాత్రం అతడిని దోషిగా తేల్చింది. వైవాహిక అత్యాచారానికి సంబంధించిన పిటిషన్లను జాబితా చేయడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణిస్తే సామాజిక ప్రభావం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.

Show comments