Site icon NTV Telugu

Manu bhaker: ప్రైవేట్ ఈవెంట్‌ల్లో మెడల్స్ ప్రదర్శన‌పై ట్రోల్స్.. మను భాకర్ ఏమన్నారంటే..!

Manubhaker1

Manubhaker1

పారిస్ ఒలింపిక్స్‌లో స్టార్ షూటర్ మను భాకర్ రెండు పతకాలు సాధించింది. చిన్న వయసులో రెండు పతకాలు సాధించడంపై భారతీయుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. పారిస్ నుంచి భారత్‌కు వచ్చాక.. అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను కలిసి పతకాలు చూపించింది. అంతేకాదు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, పలు ప్రైవేటు సంస్థలు ఆహ్వానించి సన్మానం చేశాయి. ఈ సందర్భంగా పారిస్ ఒలింపిక్స్‌లో సాధించిన పతకాలను అందరికీ చూపించింది. తాజాగా దీనిపై ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Koratala Siva Exclusive Interview : దేవర డైరెక్టర్‌ కొరటాల శివతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ

ప్రైవేట్ ఈవెంట్లలో మను భాకర్ పతకాలు ప్రదర్శించడాన్ని సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు ట్రోల్స్ చేస్తు్న్నారు. ఆమె తీరును తప్పుపట్టారు. ప్రైవేటు ఈవెంట్లలో పతకాలు ఎలా చూపిస్తారంటూ నిలదీశారు. తాజాగా ఇదే అంశంపై మను భాకర్ స్పందించింది. నిర్వాహకుల అభ్యర్థన మేరకు ఈవెంట్లలో పతకాలు చూపిస్తున్నట్లు వెల్లడించింది. ప్రతి ఒక్కరికి పతకాలు చూడాలనే కోరిక ఉంటుంది. ఎవరైనా అడిగితే చూపిస్తుంటానని వివరించారు. అంతేకాకుండా నిర్వాహకులు కూడా పతకాలు వెంట తీసుకుని రావాలని కోరతారన్నారు. వారి అభ్యర్థన మేరకు తీసుకెళ్తున్నట్లు మను భాకర్ చెప్పుకొచ్చారు. ఎవరైనా చూపించమంటే గర్వంగా చూపిస్తానన్నారు.

ఇది కూడా చదవండి: MUDA land scam: ముడా స్కామ్‌లో భయపడేది లేదు.. కోర్టు ఆదేశంపై సిద్ధరామయ్య

Exit mobile version