కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ తన కొత్త పుస్తకం triggered a political firestormలో 26/11 దాడులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని లక్ష్యం గా చేసుకున్నందుకు ఆయన తన పుస్తకంలో బీజేపీ మాటలను తిప్పి కొట్టే విధంగా రాశారని చెప్పారు. భారతదేశాన్ని ప్రభావితం చేసిన జాతీయ భద్రతా పరిస్థితులపై ప్రతిస్పందనలను విడదీ యడానికి ప్రయత్నించే 304-పేజీల పుస్తకంలోని ఒక సారాంశానికి సంబంధించి @BJP4India ప్రతిస్పందన చూసి నేను చాలా సరదాగా ఉన్నానని మనీష్ తివారీ వెల్లడించారు.. నేషనల్ సెక్యూరిటీ రెమిట్‌ను కూడా వారు నిర్వహించడం కొన్ని ‘కఠిన విశ్లేషణ’లకు కూడా వారు అదే విధంగా ప్రతిస్పందిస్తారా? అని మనీష్ తివారీ ట్విట్టర్‌లో రాసు కొచ్చారు. ప్రస్తుతం ఆయన రాసిన పుస్తకం రాజకీయంగా తీవ్ర దుమా రం లేపుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 26/11 ఉగ్ర దాడుల తర్వాత పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ చర్య తీసుకోవాలని తీవ్ర ఒత్తిళ్లు వచ్చినప్పటికీ భారత్ ఈ విషయంలో సంయంమనం పాటించిందన్నారు.
ముంబైలో 26/11 ఉగ్రదాడులపై పార్టీ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపీఏ) ప్రభుత్వం ప్రతిస్పందనపై మంగళ వారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సహా బీజేపీ నాయ కులు కాంగ్రెస్‌ను నిందించారు. వారు తివారీ తాజా పుస్తకం నుంచి ’10 ఫ్లాష్ పాయింట్స్; 20 ఏళ్లు – భారతదేశంపై ప్రభావం చూపిన జాతీయ భద్రతా పరిస్థితులను కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందని పేర్కొన్నారు. వందలాది మంది అమాయక ప్రజలను క్రూరంగా హతమార్చడంలో పాకిస్థాన్ పై చర్య తీసుకోకపోవడం బలానికి సంకే తం కాదు. అది బలహీనతకు చిహ్నంగా భావించాలని బీజేపీ నేతలు అన్నారు. 9/11 దాడుల తర్వాత రాబోయే రోజులలో భారతదేశం గతి శీల ప్రతిస్పందనను కలిగి ఉండవలసిందని నేను భావించిన అభి ప్రాయం అని తివారీ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. దీనిని డిసెంబర్ 1న విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ పుస్తకం పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.