Site icon NTV Telugu

Manish Sisodia: మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు.. ఎప్పటివరకంటే..!

Sisodiya

Sisodiya

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ట్రయల్ కోర్టు పొడిగించింది. జూలై 15 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. విచారణ సందర్భంగా సిసోడియా తరపు న్యాయవాది మాట్లాడుతూ.. సీబీఐ కేసు దర్యాప్తును పూర్తి చేసిందని.. అయినా తప్పుడు ప్రకటనలు ఇస్తోందని ఆరోపించారు. దీనిపై సీబీఐ స్పందిస్తూ.. తమ ప్రకటనలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొంది.

ఇది కూడా చదవండి: OSD Rama Rao: పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ఓఎస్డీ రామారావుపై కేసు నమోదు..

జూలై 7కి సిసోడియా రిమాండ్ ముగియడంతో సీబీఐ శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. దీంతో జూలై 15 వరకు రిమాండ్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఎమ్మెల్యే నిధుల నుంచి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పత్రాలపై సంతాకం చేసేందుకు సిసోడియాకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. అలాగే కుటుంబ ఖర్చుల కోసం బ్యాంకు చెక్కులపై సంతకం చేసేందుకు కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. లిక్కర్ పాలసీ కేసులో గతేడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయ్యారు. అనంతరం ఫిబ్రవరి 28న డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేశారు.

ఇది కూడా చదవండి: Punjab: ఖలిస్తాన్ వ్యతిరేకించే శివసేన లీడర్‌‌పై దాడి.. చెలరేగిన రాజకీయ దుమారం..

Exit mobile version