Site icon NTV Telugu

Manipur: మణిపూర్‌లో కీలక పరిణామం.. కేంద్రంతో తిరుగుబాటు గ్రూపు UNLF శాంతి ఒప్పందం

Unlf

Unlf

Manipur: గత కొంత కాలంగా జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. రాష్ట్రంలో మైయిటీ, కుకీల మధ్య కొన్ని నెలలుగా ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో సుమారుగా 200 మంది వరకు మరణించగా.. చాలా మంది వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇదిలా ఉంటే మణిపూర్ రాష్ట్రంలో చాలా కాలంగా ఉన్న తిరుగుబాటు గ్రూప్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(UNLF), కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు.

ఈ శాంతి ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ అమిత్ షా ట్వీట్ చేశారు. ‘మణిపూర్ లోని పురాతన సాయుధ సమూహం UNLF హింసను త్యజించి ప్రజా స్రవంతిలో చేరడానికి అంగీకరించింది. నేను వారిని ప్రజాస్వామ్య ప్రక్రియలోకి స్వాగతిస్తున్నాను. వారి ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శాంతి, పురోగతికి ఇది మార్గం’ అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

Read Also: India-Pakistan: ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు పాక్ వెళ్లిన అంజూ.. తిరిగి ఇండియాకు వచ్చింది..

మే 3న రాష్ట్రంలో జాతి హింస చెలరేగింది. ఆ తర్వాత ఇఫాల్ లోయలో ప్రధాన నిషేధిత సంస్థగా ఉన్న మిలిటెంట్ గ్రూపుతో శాంతి చర్చలు జరపడం ఇదే తొలిసారి. ఆర్కే మేఘన్ నేతృత్వంలో ఈ సాయుధ సమూహం ఏర్పడింది. మణిపూర్ సార్వభౌమాధికారం కోసం గెరిల్లా యుద్ధంతో ఈ సంస్థ పోరాడుతోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)లాగే ఈ తాజాగా శాంతి ఒప్పందానికి అంగీకరించిన UNLF కూడా మణిపూర్, భారతదేశంలో కలవడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తోంది. తాజా శాంతి ఒప్పందంతో ఆరు దశాబ్ధాల సుదీర్ఘ సాయుధ పోరాటానికి ముగింపు పలికినట్లైంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, యువతకు మంచి భవిష్యత్తును అందించాలనే ప్రధాని మోడీ దార్శనికతకు ఇది మైలు రాయి అని అమిత్ షా అన్నారు.

Exit mobile version