Site icon NTV Telugu

Manipur Landslide: 14 మంది మృతి..60 మంది చిక్కుకున్నట్లుగా అనుమానం

Manipur Landslide

Manipur Landslide

మణిపూర్ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు 14 మంది మరణించారు. మరో 60 మంది దాకా చిక్కుపోయినట్లు అదికారులు అనుమానిస్తున్నారు. చాలా మంది ఇంకా శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. మణిపూర్ డీజీపీ పి డౌంగెల్ మాట్లాడుతూ.. 23 మందిని కొండచరియల కింద నుంచి బయటకు తీయగా 14 మంది మరణించారని వెల్లడించారు. ఇండియన్ ఆర్మీతో పాటు అస్సాం రైఫిల్స్, టెరిటోరియల్ ఆర్మీ దళాలు ఘటన జరిగినప్పటి నుంచి రెస్క్యూ చర్యలు కొనసాగిస్తున్నారు. సైన్యం, రైల్వే సిబ్బంది, సమీప గ్రామాల్లోని కూలీలు కొండచరియల కింద చిక్కుకున్నారు. అననుకూల పరిస్థితులు ఎదురవుతున్నా.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Read Also:Manipur: విరిగిపడిన కొండచరియలు.. 7గురు జవాన్లు మృతి, 45మంది గల్లంతు

మణిపూర్ లోని నోని జిల్లాలోని టుపుల్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం అర్థరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. భారీగా వర్షాలు కురుస్తుండటంతో సమీపంలో మోహరించిన 107 టెరిటోరియల్ ఆర్మీకి చెందిన స్థావరాలపై కొండచరియలు విరుచుకుపడ్డాయి. జిరిబామ్ నుంచి ఇంఫాల్ వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ రక్షణ కోసం ఆర్మీ అక్కడ ఉంది. ప్రధాని మోదీ స్వయంగా సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తో ప్రధాని మోదీ మాట్లాడారు. కేంద్ర నుంచి ఎలాంటి సాయాన్ని అయినా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Exit mobile version