Site icon NTV Telugu

Manipur: మణిపూర్‌లో భారీగా గన్స్, బుల్లెట్స్, గ్రెనేడ్స్ స్వాధీనం..

Manipur

Manipur

Manipur: మణిపూర్‌లో భద్రతా బలగాలకు కీలక విజయం లభించింది. ఆ రాష్ట్రంలో గత రెండేళ్లుగా కొనసాగుతున్న హింసనను అడ్డుకుని, శాంతిభద్రతలను పునరుద్ధరించే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్‌లో భద్రతా బలగాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాష్ట్రంలోని 5 లోయ ప్రాంత జిల్లాల్లో నిర్వహించిన ఆపరేషన్లలో భారత ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.

Read Also: IRCTC ID Block: రైల్వే కీలక నిర్ణయం.. ఇకపై టిక్కెట్ బుకింగ్ సులభంగా మారనుంది..!

నిఘా సమాచారం మేరకు ఆపరేషన్ నిర్వహించినట్లు ఐజీ కబీబ్ తెలిపారు. మణిపూర్ పోలీసులు, సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ సిబ్బంది ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, తౌబాల్, కాక్చింగ్, బిష్ణుపూర్ జిల్లాల్లో సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. 90 గన్స్, 728 రౌండ్ల మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో మూడు AK సిరీస్ రైఫిల్స్, ఒక M16 రైఫిల్, ఒక INSAS లైట్ మెషిన్ గన్, ఐదు INSAS రైఫిల్స్, నాలుగు సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్ (SLRలు) రైఫిల్, .303 క్యాలిబర్ నాలుగు రైఫిల్స్, ఏడు పిస్టల్స్ ఉన్నాయి.20 కార్బైన్‌లు, ఎనిమిది రైఫిల్స్, 20 సింగిల్-బోర్ యాక్షన్ గన్‌లు, మూడు యాంటీ-రియోట్ గన్‌లు, ఒక లాథోడ్ గన్, మూడు డబుల్-బ్యారెల్ గన్‌లు, ఆరు బోల్ట్ యాక్షన్ గన్‌లు, మూడు రెండు అంగుళాల మోర్టార్‌లు, స్థానికంగా తయారు చేసిన పైప్ గన్ ఉన్నాయి. ఇవే కాకుండా గ్రెనేడ్స్, మోర్టార్ షెల్స్, ఐఈడీలు, ట్యూబ్ లాంచర్లు, మ్యాగజైన్స్, వైర్‌లెస్ హ్యాండ్ సెట్స్ ఉన్నాయి.

Exit mobile version