NTV Telugu Site icon

Manipur: రాజీనామాపై వెనక్కి తగ్గిన సీఎం బీరెన్ సింగ్.. తాను రాజీనామా చేయనని ట్వీట్..

Biren Singh

Biren Singh

Manipur: గత రెండు నెలలుగా మణిపూర్ రాష్ట్రం జాతుల మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. ఈ సమస్యను పరిష్కరించనుందుకు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. దీంతో ఆయన మద్దతుదారులు సీఎం నివాసం ముందు ఆందోళన చేశారు. బీరెన్ సింగ్ రాజీనామా చేయొద్దని కోరారు.

ఇదిలా ఉంటే తాను రాజీనామా చేయబోవడం లేదని బీరెన్ సింగ్ ప్రకటించారు. ఇలాంటి కీలక సమయంలో తాను రాజీనామా చేయడం లేదని ట్వీట్ చేశారు. అంతకుముందు సీఎం బీరెన్ సింగ్ గవర్నర్ ని కలవడానికి బయలుదేరిన సమయంలో ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారు. దీంతో రాజధాని ఇంఫాల్ లో హైడ్రామా చోటు చేసుకుంది. అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో, ఈరోజు సీఎం రాజీనామా చేస్తున్నారనే వార్తలు వ్యాపించడంతో ఆయన మద్దతుదారులు ఆయన నివాసం ముందు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.

Read Also: Uttar Pradesh: భార్యను కాల్చేసి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. కొన ఊపిరితో ఉన్నా కాపాడని ప్రజలు

చాలా మంది ప్రజలు సీఎం రాజీనామా చేయవద్దని ఆయన మా కోసం ఎన్నో పనులు చేస్తున్నారని, మేము సీఎంకు మద్దతు ఇస్తున్నామని స్థానికులు తెలిపారు. వందలాది మంది యువకులు, మహిళలు నల్ల చొక్కాలు ధరించి బీరేన్‌సింగ్‌కు రాజీనామా చేయకూడదని డిమాండ్ చేస్తూ సీఎం నివాసం ఎదుట బైఠాయించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవద్దని ఆయన మద్దతుదారులు కూడా రాజ్‌భవన్ వెలుపల గుమిగూడి విజ్ఞప్తి చేశారు.

మేము రెండు నెలలుగా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నామని.. భారత ప్రభుత్వం, మణిపూర్ ఈ వివాదాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించే రోజు కోసం ఎదురుచూస్తున్నామని.. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రాజీనామా చేస్తే మమ్మల్ని ఎవరు నడిపిస్తారని ఓ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేసింది.

దాదాపుగా రెండు నెలలుగా మే 3న ప్రారంభమైన ఘర్షణలు మణిపూర్లో కొలిక్కిరావడం లేదు. మైయిటీ, కుకీ ప్రజలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ, ఇళ్లు తగలబెడుతున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు 10 వేల మంది ఆర్మీ మణిపూర్ లో మోహరించారు. అయితే కొన్ని మిలిటెంట్ శక్తులు పరిస్థితిని మరింతగా దిగజారుస్తున్నాయి. సరిహద్దులోని మయన్మార్ నుంచి మిలిటెంట్లు ఊళ్లపై దాడులకు తెగబడుతున్నారు.