Madhya Pradesh: యువకుడి ఆత్మహత్య.. కారణం తెలిస్తే ఇలా కూడా ఉంటారా అనుకోవడం పక్కా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man who Running Hotel Business Commit Suicide after Reaching 30: ఎంత బలమైన కారణాలున్నా ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం. అలాంటి కొంత మంది చిన్న చిన్న కారణాలతోనే ప్రాణాలు తీసేసుకుంటున్నారు. కన్నవారికి కడుపు కోత మిగులుస్తున్నారు. సమస్య ఏదైనా దాన్ని ఎదిరించి పోరాడి నిలబడగలగాలి. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటాం. ఇక మధ్యప్రదేశ్ లో ఓ యువకుడి ఆత్మహత్య దానికి కారణాన్ని తెలుపుతూ అతడు రాసిన సూసైడ్ నోట్ చూసి ఇప్పుడు అంతా షాక్ అవుతున్నారు. 30 ఏళ్లు వచ్చేశాయని ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
Also Read: Viral Video: కొరియన్ మహిళ ఇండియన్ పాటకు ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేసిందో చూశారా?
వివరాల ప్రకారం మధ్య ప్రదేశ్ లో ఓ వ్యక్తి హోటల్ నడుపుతున్నాడు. అయితే ఉన్నట్టుండి అతడు తన రివాల్వర్ తో కాల్చుకొని చనిపోయాడు. 2016 లో ఆ వ్యక్తి స్వీయ రక్షణ కోసం రివాల్వర్ తీసుకున్నాడు. పోలీసులకు దీనికి సంబంధించి సమాచారం అందటంతో అక్కడి చేరుకున్న ఖాళీలు రక్తపు మడుగులో పడి ఉన్న అతడి వద్ద నుంచి ఓ ఏడు పేజీల సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న అంశాలు పోలీసులను విస్తుపోయేలా చేశాయి. ‘నేను ఎనిమిది, తొమ్మిదేళ్ల ముందే 30 ఏళ్ల వరకే బతకాలనుకున్నాను. ఇప్పుడు నాకు ముప్పై ఏళ్లు వచ్చేశాయి. అందుకే చనిపోతున్నాను. నాకు ఎలాంటి కష్టాలు, బాధలు లేవు. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని ఆ సూసైడ్ నోట్ లో రాసి ఉంది. అయితే ఆ వ్యక్తి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు నిజంగానే 30 ఏళ్ల వరకు బతికి చనిపోవాలనుకున్నాడా? లేదా అతని ఆత్మహత్య వెనుక మారేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో కేసును పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. ఇక యువకుడి ఆత్మహత్యతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇక ఆత్మహత్యకు గల కారాణాన్ని తెలుసుకొని చాలా మంది ఇలా కూడా ఆత్మహత్య చేసుకుంటారా అని నోరెళ్లబెడుతున్నారు.
Also Read
- Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
- West Bengal: జంతర్ మంతర్ వద్ద ఘర్షణలకు పాకిస్థాన్ టెర్రరిస్ట్ ప్లాన్.. పోలీసు యూనిఫామ్లతో విధ్వంసానికి స్కెచ్..
- Uttar Pradesh: పదేళ్ల ప్రేమకథ.. హిందూ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న ముస్లిం యువతి..
- Baramulla Terrorist Arrested: బారాముల్లాలో ఉగ్రవాది అరెస్ట్.. ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
తాజావార్తలు
-
Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్‌పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
-
Samantha Pregnancy: ప్రతి దశ ఒకేలా ఉండదు.. బేబీ బంప్‌తో సమంత ఫోటోలు వైరల్!
-
Food Delivery: జొమాటో, స్విగ్గీలకు ఊహించని షాక్.. ఫుడ్ డెలివరీ రేసులోకి అడుగుపెట్టిన ‘షాపింగ్’ కింగ్..
-
AI Effect : AI దెబ్బకు ఉద్యోగాలే మాయం.. చైనాలో మొదలైన ఉపాధి సంక్షోభం.!
-
Elon Musk : నెలలోనే రూ.57 లక్షల కోట్ల ఆవిరి.. ఎలాన్ మస్క్‌కు భారీ దెబ్బ.!
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్‌మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?