కొన్ని సార్లు ఒకరు చేసే పొరపాటు.. మరికొందరికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది.. అనుకూకుండా జరిగిన పొరపాటు.. అవతికి వ్యక్తికి సర్‌ప్రైజ్ ఇచ్చే సందర్భాలు ఉంటాయి.. ఇప్పుడు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ చేసిన పనితో ఓ వ్యక్తి సంభ్రమాశ్చర్యంలో మునిగి తీలుతున్నాడు.. ఇంతకీ, ఫ్లిప్‌కార్ట్ చేసిన మిస్టేక్ ఏంటి? కస్టమర్ సర్‌ప్రైజ్ ఎందుకు? అనే విషయాల్లోకి వెళ్తే.. పండుగ సమయంలో.. బిగ్ బిలియన్ డేస్ పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించింది ఫ్లిప్‌కార్ట్.. అయితే, ఓ కస్టమర్.. ఐఫోన్ 13 ఆర్డర్ పెట్టాడు.. ఇక, తన ఆర్డర్ రానేవచ్చింది.. ఉత్సాహంగా వెంటనే ఐఫోన్ చూసేయాలంటూ.. పార్సిల్ ఓపెన్ చేశాడు సదరు కస్టమర్.. ఆ పార్సిల్‌లో వచ్చిన ఐఫోన్‌ను చూసి ఒక్కసారిగా సర్‌ప్రైజ్ అయ్యాడు. ఎందుకంటే.. ఆ కస్టమర్ ఆర్డర్ పెట్టింది ఐఫోన్ 13.. కానీ, అతను ఊహించని విధంగా.. అందుకున్నది మాత్రం ఐఫోన్ 14 కావడమే దీనికి కారణం.
Read Also: Munugode Bypoll: మునుగోడు టీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
కాగా, పండుగలను పురస్కరించుకుని సెప్టెంబర్ 23-30 మధ్య బిగ్ బిలియన్ డేస్ పేరుతో ప్రత్యేక సేల్ నిర్వహించిన ఫ్లిప్‌కార్ట్.. భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.. సెల్‌ఫోన్‌లు, గృహోపకరణాలు సహా ఇతర వస్తువులపై భారీ డిస్కౌంట్ల ప్రకటించింది.. అందులో భాగంగా ఐఫోన్లపనై కూడా డిస్కౌంట్లు ఇచ్చింది.. దీంతో, ఓ కస్టమర్ తన ఐఫోన్ కలను నిజం చేసుకోవాలనుకున్నాడు.. ఈ స్పెషల్‌సేల్‌లో ఐఫోన్ 13 తక్కువ ధరకే వస్తుండడంతో.. దాని కోసం పోటీపడ్డారు కస్టమర్లు.. డిమాండ్‌ను తట్టుకోలేక.. చాలా మంది ఆర్డర్‌లను క్యాన్సిల్ కూడా చేసింది. ఇదే సమయంలో ఓ వ్యక్తికి మాత్రం బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అతడు ఐఫోన్ 13 ఆర్డర్ పెడితే.. ఐఫోన్ 14ను డెలివరీ ఇచ్చింది.. ఐఫోన్ 13 ధరకే.. ఐఫోన్ 14 ఆ వ్యక్తి సొంతం చేసుకున్నాడు.. ఇక, ఫ్లిప్‌కార్ట్ నుంచి ఐఫోన్ 14 మొబైల్ రావడంతో సదరు కస్టమర్ ఎగిరి గంతేశాడు. అతడి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.. అయితే.. అశ్విన్ హెగ్దే అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఈ వ్యవహారాన్ని షేర్ చేయడంతో.. అది కాస్తా వైరల్‌అయ్యింది..
One of my follower ordered iPhone 13 from Flipkart but he recieved iPhone 14 instead of 13 😂 pic.twitter.com/FDxi0H0szJ
— Ashwin Hegde (@DigitalSphereT) October 4, 2022